పాక్, చైనాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి: బిపిన్ రావత్
న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌తో యుద్దానికి సిద్దంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు.
భారత్‌పై దురాక్రమణకు చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌తో కూడ రాజీ కుదిరే అవకాశం కన్పించడం లేదన్నారు బిపిన్ రావత్.

సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. ఇటీవల డోక్లాంలో భారత్, చైనా సైన్యం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సమస్యలను త్వరగా ముగించే అవకాశం ఉందన్నారు.
కానీ, చైనాతో పాటు పాకిస్థాన్‌తో కూడ యుద్దం చేసేంతవరకు వెళ్ళాల్సి రావొచ్చని చెప్పారు రావత్. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఆర్మీ ఉందన్నారు బిపిన్ రావత్.
దేశం బయటి నుండి వచ్చే ప్రమాదాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఆర్మీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని బిపిన్ రావత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications