కావేరీ బోర్డు: ఇద్దరు డిఎంకె కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
చెన్నై: కావేరీ బోర్డు ఏర్పాటు విషయమై తమిళనాడు రాష్ట్రంలో రాజకీయపక్షాలు ఆందోళన సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా పీలవేడు వద్ద చేపట్టిన నిరసనల్లో డీఎంకెకు చెందిన ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
కావేరీ జలాల సాధన కోసం తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరువారాలు దాటినా కేంద్రం కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేదు.

దీంతో తమిళనాడు రాష్ట్రంలో విపక్షాలు ఆందోళనలు సాగిస్తున్నాయి. పీలమేడు వద్ద చేపట్టిన నిరసనల్లో డీఎంకేకు చెందిన ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. అయితే సకాలంలో పోలీసులు స్పందించారు.
పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని పీటీ మురుగేశన్, సింగై సదాశివంగా గుర్తించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపక్షాలు ఆందోళనలు నిర్వహించారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కావేరీ బోర్డు ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 5వ తేదిన తమిళనాడు రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి.ఆదివారంనాడు చెన్నైలో సమావేశమైన విపక్షాలు ఈ మేరకు విపక్షాలు తమిళనాడు రాష్ట్ర బంద్ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.












Click it and Unblock the Notifications