కోల్ కతా డాక్టర్ ను రేప్ చేసింది ఆ పోలీసు..ఛార్జిషీట్ లో తేల్చేసిన సీబీఐ..!
కోల్ కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ ఎట్టకేలకు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటనపై కేవలం రెండు నెలల్లోనే దర్యాప్తు ముగించిన సీబీఐ.. ఇది గ్యాంగ్ రేప్ కాదని తేల్చేసింది. అంతే కాదు ఈ రేప్, హత్యకు పాల్పడింది ఒక్కడు మాత్రమేనని కూడా వెల్లడించింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ సంచలనంగా మారింది.
కోల్ కతా పోలీసు శాఖకు వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తే ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య ఘటనలకు కారకుడని సీబీఐ నిర్ధారించింది. రేప్ జరిగిన ఆగస్టు 9న మృతురాలు ఉన్న సెమినార్ హాల్ ఫ్లోర్ లోనే సంజయ్ రాయ్ ఉన్నట్లు అక్కడ దొరికిన బ్లూటూత్ ఆధారంగా సీబీఐ నిర్ధారించింది. అంతే కాదు మృతురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని కూడా తెలిపింది. కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఆమెను రేప్ చేసి హతమార్చినట్లు ఛార్జిషీట్ లో వెల్లడించింది.

కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య జరిగిన తర్వాత ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. బెంగాల్ తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో డాక్టర్లు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు.. ఆగస్టు 13న ఈ కేసు సీబీఐకి అప్పగించింది. అయితే అప్పటికే క్రైమ్ సీన్ లో ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నాలు జరిగాయని సీబీఐ తెలిపింది. అయితే కోల్ కతా పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగిన వాలంటీర్ సంజయ్ రాయ్ ఈ దురాగతానికి పాల్పడం వల్లే ఇదంతా జరిగిందని సీబీఐ చెబుతోంది.












Click it and Unblock the Notifications