హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు...
తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. మార్క్ ఆంటోనీ చిత్రం సర్టిఫికేషన్ విషయంలో అసలేం జరిగిందన్న దానిపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశముంది.
తాను నటించి, నిర్మించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు క్లియరెన్స్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన హీరో విశాల్.. వారు అడిగిన మొత్తం రెండు విడతలుగా చెల్లించారు. వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఆ తర్వాత ఓ ట్వీట్ చేశారు. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. తనలాంటి వారి పరిస్దితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు.

దీంతో కేంద్రం వెంటనే స్పందించింది. సెన్సార్ బోర్డు సభ్యులు హీరో విశాల్ చిత్రానికి క్లియరెన్స్ కోసం రూ.7 లక్షల లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో సెన్సార్ బోర్డుకు చెందిన ముగ్గురిపై కేసులు పెట్టింది. అయితే వీరి వివరాలను మాత్రం సీబీఐ బయటపెట్టడం లేదు.
అయితే సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వ్యక్తులు మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎమ్, మరికొందరు సెన్సార్ బోర్డు అధికారులు కూడా ఉన్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. వీరిపై సెప్టెంబర్లో ఒక ప్రైవేట్ వ్యక్తి రూ. 7 లక్షల లంచం పొందేందుకు, హిందీలో డబ్ చేసిన చిత్రానికి అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డు నుండి అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications