
CBSE exam 2021: పరీక్షలు రద్దు -కేంద్రం యూటర్న్ -మోదీ రాకతో మారిన సీన్ -ప్రధాని కీలక కామెంట్లు
వారం, పదిరోజులు కాదు.. ఏకంగా నెలల తరబడి విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఒకటే ఉత్కంఠ.. నిజంగా అది భరింపరానిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే ఉత్కంఠకు తెర దించుతూ.. పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని గత వారం కేంద్ర విద్యా శాఖ ప్రకటించగా, ఆ నిర్ణయానికి పూర్తి భిన్నంగా పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ కుండబద్దలుకొట్టారు. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఎట్టకేలకు పూర్తిగా రద్దయిపోయాయి. దీనికి సంబంధించి ప్రధాని మోదీ, కేంద్ర విద్యా శాఖ మంగళవారం కీలక ప్రకటనలు చేశారు..
కేంద్ర ఎన్నికల సంఘంలో అనూహ్యం -నూతన సీఈసీగా సుశీల్ చంద్ర -సునీల్ అరోరా ముందస్తు రిటైర్మెంట్

వారంలో కేంద్రం యూటర్న్
దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల సుదీర్ఘ భవిష్యత్తు దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మే 23న తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రమంత్రులు రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్‌తో పాటు వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పరీక్షా బోర్డు చైర్మన్లు గత వారం భేటీ అయిన పరీక్షలు రద్దుకాబోవని ప్రకటించగా, ఇవాళ పరీక్షల అంశంపై నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే జోక్యం చేసుకోవడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షలు నిర్వహించరాదని ప్రధాని ఆదేశించడంతో ఆయనే నాయకుడిగా ఉన్న కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లయింది..
వ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులు

సీబీఎస్ఈ 12 పరీక్షలు రద్దు..
కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దయిపోగా, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై నెలలపాటు టెన్షన్ కొనసాగింది. పరీక్షలపై ముందుకే వెళ్లాలని మే 23న నిర్ణయించగా, జూన్ 1 నాటికి తేదీలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు దాదాపు బీజేపీయేతర పార్టీలన్నీ పరీక్ష రద్దుకు వినతులు, డిమాండ్లు చేయడంతో ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. మంగళవారం ప్రధాని అన్ని రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఉత్కంఠకు శాశ్వతంగా తెరపడినట్లయింది. 10వ తరగతి మాదిరిగానే, ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే 12వ తరగతి ఫలితాలను నిర్ణయిస్తారు. కాగా,
Recommended Video

విద్యార్థుల సేఫ్టీకే ప్రధాన్యం..
''విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు రాసేలా విద్యార్థులపై ఒత్తిడి చేయడం తగదు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన టెన్షన్ అనుభవించారు. విద్యార్థుల ఆరోగ్యాలు, వారి సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నాం. విద్యార్థుల సేఫ్టీ విషయంలో రాజీపడరాదనే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లు చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు కావడంతో మిగతా రాష్ట్రాల్లో ఇంకా ఊగిసలాటగా ఉన్న పరీక్షలు కూడా రద్దయ్యే అవకాశముంది.