సీబీఎస్ఈ పరీక్షల రీషెడ్యూల్: రెండు పరీక్షల తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీ నేపథ్యంలో రీ ఎగ్జామ్ తేదిలను బోర్డు ప్రకటించింది. పేపర్ల లీకేజీ విషయంలో కొత్తగా పరీక్ష నిర్వహించే తేదీలను బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేది నుండి పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది.
సీబీఎస్ఈ పరీక్ష పేపర్లు లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహరం దేశవ్యాప్తంగా విద్యార్ధులను ఆందోళనకు గురిచేసింది విద్యార్ధులు ఆందోళనలు కూడ చేశారు.

పదో తరగతి గణిత పరీక్షలను కేవలం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్ణయిస్తే జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై 15 రోజుల్లో స్పష్టత వస్తోందన్నారు. అయితే విద్యార్ధుల విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకొంటుందని ఆయన తెలిపారు. మరోవైపు పరీక్ష పేపర్ల లీకేజీ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకొంటామని విద్యాశాఖ ప్రకటించింది.












Click it and Unblock the Notifications