వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక మాఫియా పనేనా: ట్రక్ కింద నలిగిపోయిన జర్నలిస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

జర్నలిస్టును లారీ తొక్కించేశారు: సిట్ దర్యాప్తునకు ఆదేశం

భోపాల్: మధ్యప్రదేశ్‌లో టూవీలర్‌పై వెళ్తున్న పరిశోధనాత్మక జర్నలిస్టు సందీప్ శర్మ ట్రక్ కింద నలిగిపోయిన వైనం సిసీటీవి పట్టించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని భీండ్‌లో రద్దీగా ఉండే ప్రదేశంలో అతనిపై నుంచి ట్రక్ దూసుకుపోయింది.

ట్రక్ పైనుంచి దూసుకుపోవడంతో సందీప్ శర్మ మరణించాడు. 35 ఏళ్ల సందీప్ శర్మ ఓ జాతీయ చానెల్‌ల పనిచేస్తూ ఆ ప్రాంతంలోని శక్తివంతమైన ఇసుక మాఫియాపై వార్తాకథనాలు రాస్తూ వస్తున్నాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

CCTV Catches Moment When Journalist Who Took On Sand Mafia Is Run Over

ఇద్దరి పిల్లల తండ్రి అయిన సందీప్ శర్మ టూవీలర్‌పై వెళ్తుండగా ట్రక్ అకస్మాత్తుగా ఎడమవైపు వచ్చి అతనిపై నుంచి దూసుకుపోయింది. పోలీసు స్టేషన్‌కు కొద్ది దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. సిసిటీవీలో మొత్తం సిసిటీవి కెమెరాలో రికార్డు అయింది. దాన్ని చూస్తే సందీప్ శర్మది హత్యగా అనుమానాలు కలుగుతోంది.

ఇసుక మాఫియాకు, పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలపై సందీప్ శర్మ వార్తాకథనాలు రాస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టుల భద్రత తమకు అత్యంత ప్రధానమైందని, దోషులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు.

జర్నలిస్టు మరణించిన సంఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెసు నేత జ్యోతిరాదిత్య డిమాండ్ చేశారు. ఇది అత్యంత తీవ్రమైన విషయమని, అనుమానాస్పదమైన సంఘటన అని ఆయనయ అన్నారు .

సందీప్ శర్మ మృతికి కారణమైన ట్రక్ డ్రైవర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని రణవీర్ సింగ్‌గా గుర్తించారు అతనికి భారీ వాహనాలు నడిపే లైసెన్స్ లేదని చెబుతున్నారు. శర్మ మృతిపై విచారణకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేశారు.

ఇటీవల బీహార్‌లో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దైనిక్ భాస్కర్‌ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ నిశ్చల్, అతని సహోద్యోగి విజయ్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే, విలేజ్ కౌన్సిల్ హెడ్, అతని కుమారుడు వాహనంతో కావాలని ఢీకొట్టి వారిని చంపేశారనే ఆరోపణలు ఉన్నాయి.

English summary
Police in Madhya Pradesh have arrested the man who was allegedly driving the truck that ran over and killed a journalist in Bhind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X