యుద్ధ సన్నాహాలేనా? రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీడీఎస్ కీలక భేటీ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారత్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారంనాడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు.
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలు, సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంసిద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జిత్ సింగ్ చౌధరీ కూడా నార్త్ బ్లాక్ చేరుకున్నారు. సరిహద్దులో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్న వేళ ఈ వరుస భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత ఏదైనా మిలిటరీ యాక్షన్ ఉంటుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల రద్దు, బోర్డర్ మూసివేత వంటి తదితర చర్యలతో పాకిస్థాన్ భయం మొదలైంది.
మరోవైపు, భారత నేవీ అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు, క్షిపణి పరీక్షలు చేపట్టడంతో పాక్ వెన్నులో వణుకుపుడుతోంది. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ పైకి పాక్ మంత్రులు గంభీరాుల పలుకుతున్నప్పటికీ.. లోపల మాత్రం భయంతో వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే పలువురు ఆర్మీ ఉన్నతస్థాయి అధికారుల కుటుంబాలక్ పాక్ దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోవడం గమనార్హం. మరికొందరు భారత్ తో యుద్ధం వస్తుందనే భయంతో తమ విధులకు రాజీనామాలు చేస్తున్నారు.
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదంపై భారత్ యుద్ధం ప్రకటించింది. పహల్గాంతోపాటు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను ధ్వంసం చేసింది. పలువురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పాక్‌పై తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది భారత్. ఇక, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి దాడులు చేసి పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమవుతున్టన్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications