కోవిషీల్డ్ డోసుల కోసం కేంద్రం ఆర్డర్ ..ఒక్కో డోసు రూ.200 ,నేటి నుండే రవాణా : సీరమ్ సంస్థ వెల్లడి
ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ టీకా కోవిషీల్డ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుండి కొనుగోలు ఆర్డర్‌ను అందుకున్నట్లు ధృవీకరించింది . ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రా జెనికా సంస్థలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్లో కోవిషీల్డ్ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం నుండి కొనుగోలు ఆర్డర్‌ను అందుకున్నట్లు వెల్లడించిన సీరమ్
భారతదేశంలో కోవిడ్ -19 టీకా డ్రైవ్ త్వరలో ప్రారంభం కానుండగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అధికారులు తమ టీకా కోవిషీల్డ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుండి కొనుగోలు ఆర్డర్‌ను అందుకున్నట్లు ధృవీకరించారు. ఈ వ్యాక్సిన్ ఒక డోసుకు 200 రూపాయల చొప్పున లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వారం కొన్ని మిలియన్ మోతాదుల కోవిషీల్డ్ సరఫరా చేస్తుందని , ప్రారంభంలో 11 మిలియన్ మోతాదులను సరఫరా చేయవచ్చునని తెలుస్తుంది.

ఒక్కో డోసుకు రూ .200 ధర
నిర్దిష్ట టీకా ఎగుమతి జనవరి 16 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది . ఇప్పటివరకు మొదటి 100 మిలియన్ మోతాదులకు ఒక్కో డోసుకు రూ .200 ధర నిర్ణయించబడింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ), జనవరి 5 న, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా యొక్క కోవిషీల్డ్ మరియు భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ చేత తయారు చేయబడిన రెండు వ్యాక్సిన్లకు అనుమతి ప్రకటించింది. ఈ టీకాను మొదట ఒక కోటి ఆరోగ్య కార్యకర్తలతో పాటు రెండు కోట్ల ఫ్రంట్‌లైన్ మరియు అవసరమైన కార్మికులకు అందించనున్నారు.

నేటి పూణే నుంచి టీకా రవాణా చేపట్టనున్న సీరమ్ .. తొలిదశలో 11 మిలియన్ల డోసులు
ఒక కోటి ఆరోగ్య కార్యకర్తలతో పాటు రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రకటించారు. జనవరి 16 నుండి టీకా పంపిణీ చేపట్టనున్నట్టు గతవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రస్తుతం టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది . ఈరోజు సాయంత్రం నుంచి పూణే నుంచి టీకా రవాణా చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా 11 మిలియన్ల డోసులను సీరమ్ ప్రభుత్వానికి అందించనుంది .
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications