Rajeev Kumar: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు తప్పిన ప్రమాదం..
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం సహకరించకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ముందుకు వెళ్లలేకపోయింది. అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి రావడంతో ఉత్తరాఖండ్ లోని పితోరాగర్ ప్రాంతంలోని రాలామ్ అనే గ్రామంలోని పొలాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది.
దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నార. ఈ హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు అధికారులు ఉన్నారు. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ తర్వాత పితోరాగర్ జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ తో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పితోరాగర్ జిల్లా మేజిస్ట్రేట్
ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఉత్తరాఖండ్ లోని ఆది కైలాష్ ప్రాంతంలో పర్యటించేందుకు హెలికాప్టర్ లో వెళ్తున్నారు. కాగా మంగళవారం రాజీవ్ కుమార్ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

జార్ఖండ్ లోని 81 స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దఫాలో అక్టోబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 28న నామినేషన్ల స్క్రూటీని ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 30న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 13న తొలి దశ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశకు సంబంధించి అక్టోబర్ 22న నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 29 నుంచి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 30న నామినేషన్ల స్క్రూటీని ఉండగా.. నవంబర్ 1 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 22 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. అక్టోబర్ 30న నామినేషన్ల స్క్రూటీ పూర్తి చేయనున్నారు. నామినేషన్ విత్ డ్రాకు నవంబర్ 4 తేదీ వరకు సమయం ఉంది. నవంబర్ 20న పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications