మరోసారి.. ఆధార్- పాన్ కార్డు లింకప్ గడువు పొడగింపు.. ఈ సారి 3 నెలలు
పాన్ కార్డుతో ఆధార్ లింకప్ సమయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడగించింది. ఈ సారి 3 నెలల సమయం ఇచ్చింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానించాలని ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది.
గతంలో జూన్ 30 వరకు గడువు విధించగా, అది కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటన చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం వివరించింది.

దీంతో పాన్ కార్డు పనిచేయవు. దాంతోపాటు బ్యాంకు ఖాతాలో రూ.49 వేల 999 కన్నా ఎక్కువగా డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. పాన్ కార్డుతో ఆధార్ లింకప్ వల్ల సేవింగ్స్/ కరెంట్ ఖాతాకు నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం.












Click it and Unblock the Notifications