ఉద్యోగులకు దీపావళి కానుక - 3 శాతం డీఏ పెంపు..!!
ఉద్యోగులకు శుభవార్త. దీపావళి వేళ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరుగుతుందని అంచనా వేసారు. కానీ, దీపావళి కానుకగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1న అందుకునే అక్టోబర్ వేతనాలతోనే పెరిగిన డీఏ చెల్లింపు ప్రారంభం కానుంది.
కేంద్రం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక ప్రకటించింది. మూడు నెలల బకాయిలతో కలిపి మూడు శాతం పెరిగిన డీఏ చెల్లింపు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు కోటి మందికి ఈ మేరకు లబ్ది జరగనుంది. పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపు రెండు సార్లు ప్రకటిస్తారు. ఏఐసీపీఐ ప్రాతిపదికగా డీఏను ఖరారు చేస్తారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడు శాతం మేర డీఏ పెంచుతూ వచ్చిన ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ లోనూ తాజా నిర్ణయం తమకు సానుకూలంగా మారుతుందనే చర్చ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆగస్టులోనే డీఏ పెంపు పైన ప్రకటన ఉంటుందని భావించారు. ఆ తరువాత హర్యానా, జమ్ము - కాశ్మీర్ ఎన్నికలు రావటంతో అప్పుడు నిర్ణయం వస్తుందని అంచనా వేసారు. అయితే, కేంద్రం మంత్రి దీపావళి కానుకగా డీఏ పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీఏ 50 శాతంగా ఉండగా.. దీనిని ఇప్పుడు 53 శాతానికి చేరనుంది.












Click it and Unblock the Notifications