రూ.75 నాణెం విడుదల- స్పెషల్‌ డే: తయారీ ధాతువులివే..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం.. ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమాన్ని 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సమాజ్‌వాది పార్టీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగల్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ- హాజరు కావట్లేదు.

Rs 75 coin

ఈ కార్యక్రమానికి ఎన్డీఏ సంకీర్ణ కూటమి 15 భాగస్వామ్య పక్షాలు- హాజరు కానున్నాయి. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతి కారీ మోర్చా, రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీ, అప్నా దళ్ (సోనేలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ మానిల కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మిజో నేషనల్ ఫ్రంట్, నాయకులు ఇందులో పాల్గొననున్నారు.

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్.. కూడా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించాయి. గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి, ఆ తరువాత ప్రతిపక్షాలతో జట్టు కట్టి.. ఇప్పుడు మళ్లీ బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తోన్న తెలుగుదేశం పార్టీ సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానుంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రత్యేకంగా 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను కొద్దిసపటి కిందటే విడుదల చేసింది. నాణెం ప్రత్యేకతలను ఇందులో వివరించిందా శాఖ.

నాణేనికి ఒకవైపు జాతీయ చిహ్నాలైన మూడు సింహాలు, మరో వైపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ముద్రించారు. దాని కింద 2023 అనే అంకెలు ఉంటాయి. ఈ నాణెం.. 44 మిల్లీ మీటర్ల డయాను కలిగి ఉంటుంది. 200 సెర్రేషన్స్‌తో ఇది తయారయింది. 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, అయిదు చొప్పున నికెల్, జింక్‌ ధాతువులను ఈ కాయిన్ తయారీలో వినియోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+