ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రం వెనక్కి ? ప్రస్తుతానికి వాయిదా ! భవిష్యత్తులో అమలు ఇలా..?

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు వీలుగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు పేరుతో బీజేపీ అజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బిల్లు రూపంలో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే మూడు కీలక అంశాలు ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురాకుండా బీజేపీకి అడ్డుకట్ట వేసేశాయి. దీంతో బీజేపీ వ్యూహం మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ఒకే చట్టం అమలు పేరుతో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు సిద్ధమైన కేంద్రానికి అదే సమయంలో మణిపూర్ సమస్య అడ్డంకిగా మారింది. మణిపూర్ లో పార్లమెంట్ లో ఇంత రచ్చ జరుగుతుంటే బీజేపీ అజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బిల్లుగా మార్చి పార్లమెంటులో పెడితే మరింత రచ్చ తప్పదనే సంకేతాలు అందాయి. అలాగే విపక్షాలు ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో ఏకమై పార్లమెంట్ ను అడ్డుకుంటున్నాయి. లోక్ సభలో భారీ మెజారిటీ కలిగిన కేంద్రాన్ని అక్కడా, మెజారిటీ లేని రాజ్యసభలో సైతం అడ్డుకుంటున్నాయి. దీంతో కేంద్రం డిఫెన్స్ లో పడిపోయింది.

centre temporarily step back on uniform civil code bill ? here is bjps big plan..

పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రవేశపెట్టినా దీన్ని చర్చ లేకుండా, విపక్షాల అభిప్రాయాలు చెప్పకుండా నెగ్గించుకునే పరిస్ధితి లేదు. దీంతో బిల్లు పెట్టినా వృథా అవుతుందన్న భావనలోకి బీజేపీ వచ్చేసింది. దీంతో వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఈసారి ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు అర్ధమవుతోంది. వైసీపీ, బీజేడీ వంటి ఎన్డీయే, ఇండియాతేర కూటముల పార్టీలు మద్దతిస్తున్నా బిల్లు నెగ్గించుకునే పరిస్దితి లేకపోతే వరువు పోతుందనే భయం బీజేపీని వెంటాడుతోంది. దీంతో కొత్త వ్యూహం అమలుకు సిద్ధమైంది.

ఇప్పటికే అసోం, ఉత్తరాఖండ్ తో పాటు పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితో పాటు మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టి సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి చూపించి ఆ తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చూపించి అప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పటికే ఇదంతా కష్టమేనని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+