RSS, BJP కి ఇష్టం లేని దాన్ని తుడిచి పెట్టేస్తారు..: రోడ్డెక్కిన సిద్ధరామయ్య, డీకేశి

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధిలో గత ప్రభుత్వాల కన్నా తాము ఎంతో ఎక్కువ చేశామని, గ్రామీణులకు పక్కా ఇళ్లు మొదలుకుని అనేక రకాల సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు.

ఉపాధి హామీ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు టేబుల్ అయిన వెంటనే నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల్లో నుంచి చెరిపివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సంవత్సరంలో 100 రోజుల పాటు గ్రామీణులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును స్క్రాప్ చేయాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు.

Centre s MGNREGA renaming sparks Karnataka protest led by Siddaramaiah and DK Shivakumar

ఈ వ్యవహారం పార్లమెంట్ కే పరిమితం కావట్లేదు. దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్.. మహా ధర్నా చేపట్టింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని బెళగావిలో ధర్నా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు దినేష్ గుండూరావు, రామలింగారెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బెళగావిలో నిర్వహించడం కర్ణాటక ప్రభుత్వ ఆనవాయితీ. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దినేష్ గుండూరావు ఘాటుగా స్పందించారు. జాతిపిత మహాత్మా గాంధీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గానీ, భారతీయ జనతా పార్టీ గానీ ఇష్టపడరని, వారికి ఇష్టం లేనిదాన్ని చరిత్రలో కూడా ఉండనివ్వరని విమర్శించారు. మహాత్ముడి మీద ఉన్న వ్యతిరేకతను ప్రతి పనిలోనూ చూపిస్తోన్నారని ఆరోపించారు.

ఇందులో భాగంగానే మహాత్మగాంధీ పేరు మీద గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రూపుమాపే దుర్మార్గానికి బీజేపీ ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉపాధి కల్పన పథకం ఉనికిని లేకుండా చేయడాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని రామలింగారెడ్డి ప్రశ్నించారు. మొదటి నుండి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+