జియో, ఎయిర్ టెల్ కు మోడీ బిగ్ షాక్..! ఎలాన్ మస్క్ హ్యాపీ..!

భారత్ లో రెండు ప్రధాన మొబైల్ ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ కు కేంద్రం భారీ షాకిచ్చింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం నిర్వహించాల్సిన వేలంపై వెనక్కి తగ్గింది. దీన్ని ఎలాగైనా నిర్వహించాల్సిందేనని ఈ రెండు కంపెనీలు పట్టుబట్టినా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించకపోయినా పరోక్షంగా ఓ సాకు చెప్పి తప్పించుకుంది.

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం ప్రభుత్వం వేలం నిర్వహించదని, పరిపాలనాపరంగానే కేటాయింపులు జరుగుతాయని కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తేల్చిచెప్పేశారు. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉచితంగా ఇవ్వబోమని, టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ త్వరలో రిసోర్స్‌కు ధరను నిర్ణయిస్తుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రతీ దేశం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) ని అనుసరించాల్సిందేనని, ఇది అంతరిక్షం లేదా ఉపగ్రహాలలో స్పెక్ట్రమ్ కోసం విధానాన్ని రూపొందించే సంస్థ అని మంత్రి తెలిపారు.

centre s setback to jio and airtel for elon musk- here are details

స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రాతిపదికన ఇచ్చే విషయంలో ఐటీయూ చాలా స్పష్టంగా ఉందని మంత్రి సింధియా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ కోసం స్పెక్ట్రమ్‌ను వేలం వేసే ఒక్క దేశం గురించి తాను ఆలోచించలేనంటూ సింధియా తేల్చిచెప్పేశారు. డిజిటల్ టెక్నాలజీ కోసం ఐరాస ఏజెన్సీ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ లో సభ్య దేశంగా ఉన్న భారత్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.

అదే సమయంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ కు చెందిన ప్రాజెక్ట్ కైపర్ వంటి గ్లోబల్ పీర్‌లు పాలనాపరంగా మాత్రమే స్ప్రెక్ట్రమ్ కేటాయింపుకు మద్దతు ఇచ్చాయి. కేంద్రం నిర్ణయంపై ఎలాన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ లో మస్క్ "ప్రామిసింగ్" అంటూ ట్వీట్ చేశారు. అలాగే కేంద్రం నిర్ణయంతో స్టార్‌లింక్ వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడం సులువు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+