Chanakya Strategies Survey: ఎన్డీఏదే అధికారమన్న చాణక్య స్ట్రాటజీస్, హేమంత్‌కు నిరాశే!
జార్ఖండ్ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేలుస్తున్నాయి. తాజాగా, చాణక్య స్ట్రాటజీస్ సర్వే తన అంచనాలను విడుదల చేసింది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంచనాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపడుతుంది. ఎన్డీఏ కూటమికి మొత్తం 81 సీట్లకు గానూ 45-50 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 35-38 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులకు 3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.

మరోవైపు, మరికొన్ని సర్వే సంస్థలు కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్డీఏదే అధికారమని పేర్కొంటున్నాయి. మాట్రిట్జ్ సర్వే ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 42-47 స్థానాలు, కాంగ్రెస్-జేఎంఎం కూటమి 25-30, ఇతరులు 1-4 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 40-44, జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 30-40, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం.. ఇండియా కూటమికి 44-53, ఇండియా కూటమికి 25-37, ఇతరులకు 5-9 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చింది. పీమార్క్ సర్వే ప్రకారం.. ఎన్డీఏకు 31-40 సీట్లు, ఇండియా కూటమికి 37-47, ఇతరులకు 1-6 సీట్లు వస్తాయని పేర్కొంది. పీమార్క్ తోపాటు యాక్సెస్ మైఇండియా, పోల్స్ ఆఫ్ పోల్స్ ఇండి కూటమికి ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి.
యాక్సెస్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏకు 25 సీట్లు, ఇండియా కూటమికి 53 సీట్లు, ఇతరులకు 3 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్స్ ఆఫ్ పల్స్ అంచనాల ప్రకారం.. ఎన్డీఏకు 38-43 సీట్లు, ఇండియా కూటమికి 34-41 స్థానాలు, ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని వెల్లడించింది. మొత్తానికి ఈ ఎగ్జిట్స్ పోల్స్ అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీకి కొంత నిరాశనే కలిగించాలే ఉన్నాయి. అయితే, నవంబర్ 23 వచ్చే అసలైన ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications