కరోనా వైరస్ వ్యాక్సినేషన్ తర్వాత 0.06 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి: అధ్యయనం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ వల్ల మరణాల రేటు భారీగా తగ్గుతుందని, ఆస్పత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఇప్పటికే ఈ మేరకు వైద్యులు, శాస్త్రవేత్తులు పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 97.38 మహమ్మారి నుంచి రక్షణ లభిస్తోందని తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కేవలం 0.06 శాతం మాత్రమే ఆస్పత్రిలో చేరారని ఇంద్రప్రస్థా అపోలో ఆస్పత్రి తన అధ్యయనంలో పేర్కొంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? అనేదానిపై అధ్యయనం చేశారు.

Chances of hospitalisation only 0.06% after Coronavirus vaccination: Study

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై తొలి వందరోజులైన సందర్భంగా ఢిల్లీలోని ఇంద్రప్రస్థా అపోలో ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో తేలిన అంశాలను పీర్ రివ్యూడ్ మెడికల్ జర్నల్‌లో పబ్లిష్ చేయాలని యోచనలో ఉన్నారు.

గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ అపోలో ఆస్పత్రుల గ్రూప్ డాక్టర్ అనుపమ్ సిబల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రెండో వేవ్‌లో భారత్‌లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవర్ కొనసాగుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.. అయితే, అది చాలా తక్కువ మందిలో మాత్రమేనని ఆయన తెలిపారు.

పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ సిబల్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా 100 శాతం ఇమ్యూనిటీని పొందలేమన్నారు. అయినప్పటికీ.. వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ నుంచి ఆస్పత్రి బారి నుంచి ఈ వ్యాక్సిన్లు 97.38 శాతం రక్షిణ కల్పిస్తోందని నితేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత కేవలం 0.06 శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారని పేర్కొంది. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మరణించే అవకాశాలు కూడా అత్యంత తక్కువ అని తెలిపింది.

3235 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం చేశారు. 3235 మంది కేవలం 85 మంది మాత్రమే ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని వెల్లడించింది. వీరిలో 65 (2.62 శాతం) మందికి పూర్తిగా టీకాలు వేయగా, 20 (2.65 శాతం) మందికి పాక్షికంగా టీకాలు వేశారు. ఆడవారు గణనీయంగా ఎక్కువగా ప్రభావితమయ్యారని, వయస్సు సంక్రమణ సంభవంపై ప్రభావం చూపలేదని వెల్లడించింది. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+