Chandrayaan 𝟰: ఇస్రో కొత్త మిషన్ చంద్రయాన్ 4-జపాన్ తో కలిసి లూపెక్స్ పేరుతో..
చంద్రయాన్ 3 విజయంతో ఊపుమీదున్న ఇస్రో మరిన్ని కొత్త ప్రాజెక్టులను వేగంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో విదేశీ అంతరిక్ష సంస్ధలకు కూడా ఇస్రోపై నమ్మకం మరింత పెరిగింది. దీంతో త్వరలో చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ ప్రారంబించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి తమతో పాటు జపాన్ ను కూడా కలుపుకుని ఈ ప్రయోగం చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ సంయుక్త మిషన్ అంతర్జాతీయంగా సంచలనాలు రేపే అవకాశముంది.
జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో కీలకమైన చంద్రుని వద్దకు వెళ్లే తాజా వెంచర్‌కు సిద్ధమవుతోంది. లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్, LUPEXగా దీన్ని పిలవబోతున్నారు. ఇది ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) మధ్య సంయుక్త ప్రయత్నంగా ఉండబోతోంది. ఈ మిషన్ రాబోయే మూడు నుండి నాలుగు సంవత్సరాలలో జపాన్ యొక్క H3 రాకెట్‌లో బయలుదేరుతుందని అంచనా.

ఈ మిషన్ లోనూ చంద్రయాన్ సిరీస్ తరహాలోనే ల్యాండర్ , రోవర్ రెండూ ఉంటాయి. దీని ప్రాథమిక లక్ష్యం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి, ఉపరితలం మంచు రూపంలో సంభావ్యంగా నీరు, ఇతర మూలకాల ఉనికిని పరిశోధించడం. ISRO మరియు JAXA డిసెంబర్ 2017లో తిరిగి చేతులు కలిపాయి. తమ ఉమ్మడి ప్రయాణం కోసం ఇంప్లిమెంటేషన్ అరేంజ్‌మెంట్ ఒప్పందంపై సంతకం చేశాయి. మార్చి 2018 నాటికి దీని సాధ్యాసాధ్యాల నివేదికను పూర్తి చేశాయి. 2025 కంటే ముందుగానే తమ ఉమ్మడి మిషన్ ప్రారంభంపై ఇప్పుడు దృష్టిసారిస్తున్నాయి.
చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ 2019 సెప్టెంబరులో ప్రమాదానికి గురైంది. దీంతో భారతదేశం చంద్రయాన్-3ని ప్రారంభించింది. ఇది రాబోయే LUPEX అడ్వెంచర్‌కు కీలకమైన ల్యాండింగ్ సామర్థ్యాలను నేర్చుకోవడానికి రూపొందించినట్లు తెలుస్తోంది. లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ వినూత్న ఉపరితల అన్వేషణ సాంకేతికతలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాహనాల రవాణా, చంద్రుడిపై రాత్రి పూట మనుగడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రుడి ధ్రువ భూభాగాలలో స్థిరమైన అన్వేషణకు ప్లాన్ చేస్తోంది.
𝗖𝗛𝗔𝗡𝗗𝗥𝗔𝗬𝗔𝗔𝗡-𝟰 : 𝗔 𝗝𝗼𝗶𝗻𝘁 𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗕𝗲𝘁𝘄𝗲𝗲𝗻 𝗜𝗻𝗱𝗶𝗮 𝗮𝗻𝗱 𝗝𝗮𝗽𝗮𝗻. 🇮🇳🇯🇵
— Toby Li (@tobyliiiiiiiiii) August 24, 2023
With the success of the Chandrayaan-3 mission, ISRO and JAXA will work together to launch LUPEX (Chandrayaan-4) in 2026.
LUPEX will land at the Moon’s South Pole with the… pic.twitter.com/QfHIcMirSu
కానీ ఇస్రో ప్రయత్నాలు చంద్రుడితో పరిమితం కాదల్చుకోలేదు. ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో మూడు రోజులు గడిపేటటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం కూడా ఇస్రో సిద్ధమవుతోంది. అలాగే 'నిసార్' శాటిలైట్ ప్రాజెక్టు కోసం నాసాతో ఇస్రో చేతులు కలిపింది. ఈ ఉపగ్రహం భూమిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వాతావరణం, సముద్ర మట్టాలు, భూగర్భ జలాలపై ముఖ్యమైన సమాచారం అందిస్తుంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications