పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న చంటి హీరోయిన్..
చంటి సినిమాలో ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని అలరించిన నటి మీనా అందరికి గుర్తే ఉంటుంది. నటి మీనా పేరు చెప్పగానే అందరికి టక్కున చంటి సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర అంతటిని గుర్తింపును తెచ్చింది. అప్పట్లో తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది.
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెంకటేష్‌తో దృశ్యం సినిమాలో మెరిసింది ఈ అలనాటి తార. ఆ తర్వాత ఈమధ్యకాలంలో టీవీ షోల్లో కూడా మెరుస్తుంది. తాజాగా ఓ షోకు జడ్డిగా కూడా మీనా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆ షో గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ప్రస్తుతం నటి మీనా గురించి సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ ప్రచారం జరగుతుంది.

నటి మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు రాజకీయాల్లో రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నటి రోజా, నటుడు బాలకృష్ణ, ఆలీ, కుష్బు, విజయశాంతి వంటి వారెందరో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పడు తాజాగా నటి మీనా పేరు వినిపిస్తోంది. నటి మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే ఆ వార్త. ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు కేంద్రమంత్రి ఎల్. మురుగన్ మీనాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ పొంగల్ వేడుకలకు బిజెపి ప్రముఖనేతలంతా హాజరయ్యారు.

పొంగల్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మీనా..
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు నటి మీనాకు కూడా ఆహ్వానం అందింది. నటి మీనాకు ఈ వేడుకలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ వేడుకకు హాజరయిన వారిలో నటి మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట. త్వరలో ఆమె బిజెపి పార్టీలో చేరబోతున్నారని అందుకే, ఆమెకు అంతటి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. బిజెపిలో చేరేందుకు నటి మీనా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం గురించి నటి మీనా అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.












Click it and Unblock the Notifications