Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !
బెంగళూరు/మంగళూరు/చెన్నై: పక్కరాష్ట్రానికి వెళ్లిన యువతికి ఓ యువకుడు పరిచయం కావడంతో కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అపార్ట్ మెంట్ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యజమానితో భార్య క్లోజ్ గా ఉంది. తన భర్త ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడని భార్య ఆ కంపెనీ యజమానికి చెప్పింది. కంపెనీ యజమానికి మాయమాటలు చెప్పిన మహిళ రూ. 68 లక్షలు లాక్కొనింది. కొంతకాలానికి భార్య ఆమె భర్తతో కలిసి సిటీ వదిలేసి వేరేసిటీకి వెళ్లిపోయింది.

బెంగళూరు అమ్మాయి, చెన్నై చిన్నోడు
బెంగళూరులో నివాసం ఉంటున్న ధనుష్య అలియాస్ రాచెల్ (28) అనే యువతి కొన్ని సంత్సరాల క్రితం చెన్నై వెళ్లింది. చెన్నైలో నివాసం ఉంటున్న దార్బిన్ దాస్ అలియాస్ మోహన్ దాస్ (38) అనే వ్యక్తి రాచల్ కు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత మోహన్ దాస్, రాచెల్ ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

అపార్ట్ మెంట్ లో కాపురం
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దేవనహళ్లిలోని బ్రిగేడ్ అర్చడ్ అపార్ట్ మెంట్ లో మోహన్ దాస్, రాచెల్ దంపతులు కాపురం పెట్టారు. మోహన్ దాస్, రాచెల్ దంపతులకు 4 సంవత్సరా కుమార్తె, 11 నెలల కుమార్తె ఉన్నారు. అపార్టె మెంట్ లో నివాసం ఉంటున్న వారితో మోహన్ దాస్, రాచెల్ దంపతులు మంచితనంతో ఉన్నారు.

నామొగుడు కస్టమ్స్ అధికారి
రాచెల్ బెంగళూరులోని ఇందిరానగర్ లోని నైల్ బాక్స్ అకాడమిలో ఉద్యోగంలో చేరింది. ఆ అకాడమి యజమాని స్నేహ కే. భగవత్ తో రాచెల్ క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది. తన భర్త కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడని రాచెల్ అకాడమి యజమాని స్నేహ భగవత్ కు చెప్పింది.

బంగారు నగలు కోసం రూ. 68 లక్షలు
ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారు నగలు కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తున్నారని, ఆ టీమ్ లో తన భర్త కూడా ఉన్నాడని, సీజ్ చేసిన బంగారు నగలు చాలా తక్కువ ధరకు మీకు ఇప్పిస్తానని రాచెల్ అకాడమి యజమాని స్నేహ భగవత్ చెప్పింది. విడతలు విడతలు స్నేహ భగవత్ నుంచి రూ. 68 లక్షలు లాక్కొన్న రాచెల్ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

మంగళూరు జంప్
దేవనహళ్లిలోని అపార్ట్ మెంట్ ఖాళీ చేసిన మోహన్ దాస్, రాచెల్ దంపతులు ఉడిపి చేరుకుని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే కాపురం పెట్టారు. రాచెల్ మోసం చేసిందని గుర్తించిన స్నేహా భగవత్ బెంగళూరులోని కొడిగేళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉడిపి వెళ్లి కిలాడీ దంపతులు మోహన్ దాస్, రాచెల్ ను అరెస్టు చేశారు.

కిలాడీ దంపతుల కహానీ చాలానే ఉంది
మోహన్ దాస్, రాచెల్ దంపతులు వారి కూతురు చదువుతున్న స్కూల్ లోని టీచర్లకు ఎయిర్ పోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు, దేవనహళ్లిలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని, మొదట చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే దంపతులు చివరికి మోసాలు చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కిలాడీ దంపతుల నుంచి రూ. 34.50 లక్షలు నగదు, 106 బంగారు నగలు సీజ్ చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications