చెన్నైలో కూలిన భవనం: 43కు చేరిన మృతుల సంఖ్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. గత మంగళవారం నుంచి సహాయక బృందాలు మరో పది మృతదేహాలను వెలికి తీశారు. బుధవారం ఉదయం వరకు వెలికితీసిన శవాలను బట్టి మృతుల సంఖ్య 43కు చేరుకుంది.
కూలిన భవనం శిథిలాల నుంచి 27 మంది సురక్షితంగా బయటకు తీశారు. శనివారంనాడు కూలిన భవనం శిథిలాల కింద 72 మంది దాకా చిక్కుకుని ఉంటారని అంచనా. దీన్నిబట్టి మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సురక్షితంగా బయటపడినవారి, మృతులను చూస్తే 70 మంది లెక్క తేలింది. కూలిన భవన నిర్మాణం పనుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు, ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు పరిస్థితిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 8 మంది మరణించినట్లు, ఇద్దరు మంగళవారంనాడు సురక్షితంగా బయటపడినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications