చెన్నైలో ఇంటి కన్నా సెంట్రల్ జైలు సేఫ్
చెన్నై: చెన్నై నగరంలో ఇంటి కన్నా సెంట్రల్ జైలే చాల సురక్షితం అని వెలుగు చూసింది. భారీ వర్షాలు వరదల కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. ఇదే సందర్బంలో జైలులో ఉన్న ఖైదీలు మాత్రం ఎంతో సురక్షితంగా ఉన్నారని వెలుగు చూసింది.
గతంలో చెన్నై సెంట్రల్ ఎదురుగా మద్రాసు సెంట్రల్ జైలు ఉండేది. అయితే కోనేళ్ల క్రితం నగర శివార్లలోని పుళల్ ప్రాంతంలో 213 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో సెంట్రల్ జైలు నిర్మించారు. పాత జైలును పుళల్ ప్రాంతానికి తరలించారు.
ఇప్పుడు అది పుళల్ సెంట్రల్ జైలు. 3,100 మందికి పైగా అక్కడ ఖైదీలు ఉన్నారు. పుళల్ చెరువు పక్కనే ఈ సెంట్రల్ జైలు నిర్మించారు. గత 20 రోజుల నుంచి పుళల్ చెరువు పొంగిపోర్లుతున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై నగరం జలమయం అయ్యింది..

వరదలలో దాదాపు అన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే పొంగిపోర్లుతున్న చెరువు పక్కనే ఉన్న పుళల్ సెంట్రల్ జైలులోకి మాత్రం ఒక్క చుక్క వరద నీరు పోలేదని అక్కడి అధికారులు అంటున్నారు.
చెన్నై నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంతే సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలు మాత్రం కడుపునిండా భోజనం, కంటి నిండా నిద్రతో హాయిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications