చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై: భారీ వర్షాలకు పాములు సైతం విలవిల (ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: గత నెల రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తమిళనాడు తల్లడిల్లుతోంది. రాజధాని చెన్నైలో కూడా కుండపోత వర్షాలు కురవడంతో ప్రజల జనజీవన విధానం అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా చెన్నై మాహా నగరం 100 ఏళ్ల రికార్డుని అధిగమించింది.

నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 230 చేరుకోగా సోమ, మంగళవారాల్లో మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. ఇదంతా ఒకఎత్తు అయితే వర్షాల కారణంగా చెన్నై నగరంలో నిలిచిన వరద నీటితో పాటు పాములు, మొసళ్లు లాంటివి జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

chennai-rain-snake-safe-on-the-swamy-head

మంగళవారం నాడు ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని ఓ ఇంట్లోకి పైపుల ద్వారా బాత్‌రూమ్‌లోకి పాము ప్రవేశించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా నడిరోడ్లపైనే మొసళ్లు తిరగడం అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.

పాములు, మొసళ్లు సైతం భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. రోడ్లు, దేవాలయాలు, ఇళ్లు అన్నీ కూడా వర్షంతో జలమయమయ్యాయి. దీంతో నగరంలోని మల్లపురంలో ఉన్న పెరుమాళ్ దేవాలయంలో దేవుడి విగ్రహాం యొక్క తలపై ఎక్కి కూర్చోని ఓ పాము తన ప్రాణాలను కాపాడుకుంది.

చెన్నై ఎయిర్ విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు బుధవారం నాడు వెల్లడించారు. చెన్నై-బెంగళూరు మార్గం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, వచ్చే నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు భావిస్తుండటంతో మరింత నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

English summary
Mamallapuram Perumal temple submerged in water. But look at that snake safe on the head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X