అమానుషం: ప్రైవేట్ పార్ట్‌లో 10 ఇంచుల హెక్సా బ్లేడ్.. గర్భిణి అని కూడా చూడకుండా!
ప్రస్తుత కాలంలో సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైనా కానరాకుండా పోయింది. కన్నతండ్రి కసాయిలా మారిపోతుండగా.. కట్టుకున్నోడు కర్కోటకుడిలా మారిపోతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అలాంటి అత్యంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తుకు బానిసైన ఓ భర్త.. మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా తన 23 ఏళ్ల భార్యను దారుణంగా కొట్టి ఆపై ఆమె ప్రైవేట్ పార్టులోకి 10 ఇంచుల హెక్సా బ్లేడ్ చొప్పించి నరకయాతన పెట్టి ప్రాణాలు తీశాడు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితుడైన భర్తను అరెస్ట్ చేసి విచారించగా.. అతడు ఆ నేరాన్ని అంగీకరించాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిట్ఠీకలా గ్రామంలో మే 14న ఈ దారుణం జరిగింది. నిందితుడిని ప్రదీప్ అగరియాగా గుర్తించారు. ప్రదీప్‌కు, హీరాబాయికి దాదాపు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రదీప్ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఆమెను శారీరకంగా హింసించేవాడు. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య గొడవ జరగగా.. ప్రదీప్ ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘోరం జరుగుతున్న సమయంలో వారి నాలుగేళ్ల చిన్నారి కూతురు కూడా ఇంట్లోనే ఉండటం గమనార్హం.

తీవ్రమైన దెబ్బల కారణంగా హీరాబాయి స్పృహతప్పి పడిపోవడంతో నిందితుడు ఆమెను బైక్‌పై అంబికాపూర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులను, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి.. తన భార్యకు రోడ్డు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలోనే గాయపడిందని అబద్ధపు కథ అల్లాడు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. భార్య చనిపోయిందని తెలియగానే నిందితుడు ప్రదీప్ ఆస్పత్రి నుంచి మెల్లగా పరారయ్యాడు.
మరుసటి రోజు మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహించగా.. అంతవరకు దాచిన భయానక నిజం బయటపడింది. అంబికాపూర్ మెడికల్ కాలేజ్ ఫొరెన్సిక్ విభాగానికి చెందిన డాక్టర్ సంతు బాగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు 3 నెలల గర్భిణి అని, ఆమె శరీరంపై దాదాపు 17 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అన్నిటికంటే ఘోరంగా.. ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి సుమారు 10 ఇంచుల పొడవున్న పదునైన లోహపు హెక్సా బ్లేడ్‌ను వైద్యులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం నాడు నిందితుడు ప్రదీప్ అగరియాను అంబికాపూర్‌లో అరెస్ట్ చేశారు. ఈ క్రూరమైన ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications