ఎంత సీఎం అయినా.. !!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. సెంచరీతో ట్రాక్ ఎక్కాడు. బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అతను ఫామ్ లోకి రావడం అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న ఈ ఓపెనర్ అద్భుతమైన శతకంతో తన సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో, ఘన విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

సెంచరీ కోసం సంజు శాంసన్ తీసుకున్న బంతులు 52 మాత్రమే. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా బుల్లెట్ల వంటి 14 బౌండరీలు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో వరుసగా 6, 7, 9 పరుగులకే పరిమితమైన అతను ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా గేర్ మార్చాడు. అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ శతకం అతని ఐపీఎల్ కెరీర్‌లో నాలుగోది కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సాధించిన మొదటి శతకం ఇదే కావడం విశేషం.

Chief Minister MK Stalin Spotted Watching CSK vs DC Game Amid High-Stakes Tamil Nadu Poll Campaign

ఈ సెంచరీ ఇన్సింగ్స్‌లో శాంసన్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో మొత్తం 400 సిక్సర్లను బాదాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు పథుమ్ నిశ్శంక అతని క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో అనేక రికార్డులను తిరగరాశాడు. 2021లో ఐపీఎల్ లో చివరిసారిగా సెంచరీ చేశాడు సంజు. ఆ తర్వాత మళ్లీ శతకం ముఖం చూడటం ఇదే. ఈ ఐపీఎల్ సీజన్‌లో నమోదైన మొదటి శతకమూ ఇదే.

ఈ మ్యాచ్ ను అసాంతం తిలకించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆయన మ్యాచ్ చూడటానికి విరామం తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తూ ట్యాబ్ లో చెన్నై మ్యాచ్ ను ఆసక్తికరంగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను స్టాలిన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పటి వీడియో అది.

మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రచారం నుంచి కొంత విరామం తీసుకున్నానని స్టాలిన్ వెల్లడించారు. సంజు శాంసన్ సెంచరీ నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన క్రికెటర్ ఎంఎస్ ధోనీని ఈ మ్యాచ్‌లో మిస్సయిన ఫీలింగ్‌ ఉండేదని, సంజు శాంసన్ సెంచరీ దాన్ని భర్తీ చేసిందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ధోనీ జట్టులో లేని లోటు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+