చైనా భవిష్యత్తుకు ఆర్థిక గండం: అప్పుల ఊబిలో.., ఇలాగే కొనసాగితే అంతే!

Subscribe to Oneindia Telugu

బీజింగ్: చైనా భవిష్యత్తు ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా?.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా చెప్పుకునే చైనాకు నిజంగా ఇటువంటి పరిస్థితి తలెత్తిందా?. దేశ ఆర్థిక వ్యవస్థపై చైనా సెంట్రల్ బ్యాంకు తన వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

  చైనా-భారత్ కు హానికరం: అమెరికా హెచ్చరిక | Oneindia Telugu

  సెంట్రల్ బ్యాంకు గవర్నర్ జౌ జియోచౌన్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినందువల్లే చైనాలో ఈ పరిస్థితి తలెత్తిందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ జౌ పేర్కొన్నారు.

  China's economy on brink collapse due to high borrowing: Chinese bank chief

  పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదురువుతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటినుంచే చైనా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరముందని, ఇందుకోసం సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలను మూసివేయాలని సూచించారు.

  అప్పులు, వాటి వడ్డీలు చెల్లించలేని సంస్థలు అలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని జౌ అభిప్రాయపడ్డారు. 15ఏళ్లుగా చైనా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ గా పనిచేస్తున్న జౌ త్వరలోనే రిటైర్డ్ కాబోతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Zhou Xiaochuan, the governor of China's central bank - the People's Bank of China (PBOC), has warned that China's financial system is becoming more vulnerable due to high levels of leverage, or borrowing.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి