వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమబెంగాల్ దారుణం.. మ‌నుషుల‌ను ఇంట్లో పెట్టి నిప్పుపెట్టిన దుండగులు.. 8 మంది సజీవ దహనం.

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్‌ దారుణం చోటుచేసుకుంది. టీఎంసీ నేత హత్య అనంతరం చెలరేగిన అల్లర్లలో 8మంది సజీవ దహనమయ్యారు. రాజకీయ నాయకుడి హత్యకు నిరసనగా టీఎంసీ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. వారిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లకు నిప్పంటించారు. దీంతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై మమతా సర్కార్‌ని కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

టీఎంసీ నేత హ‌త్య‌


బీర్భుమ్ జిల్లా, రాంపూర్‌హట్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ నాయకుడు భదుప్రధాన్ సోమవారం ( 21న ) రాత్రి హత్యకు గురయ్యారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై నాటు బాంబులు విసిరారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో రాంపూర్‌పూట్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

మ‌నుషుల‌ను ఇంట్లో పెట్టి తాళం వేసి నిప్పు..

అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. వారిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు .. ఓ ఇంట్లో మనుషులను లోపల పెట్టి తాళాలు వేసి నిప్పంటించారు. దుండగుల దుర్మార్గపు చర్యలకు 8 మంది బలయ్యారు. మంటల్లో చిక్కుకుని సజీవదహనమైయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మంటలు చుట్టుపక్కల 12 నివావాలకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Recommended Video

China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu
 హ‌త్య‌కు ప్ర‌తీకారంగా..

హ‌త్య‌కు ప్ర‌తీకారంగా..

టీఎంసీ నేత భదు ప్రధాన్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ అసెంబ్లీని కుదిపేసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అయితే ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అటు ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మమతా సర్కార్ ఏర్పాటు చేసింది. మరోవైపు దుర్ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ .. దీదీ ప్రభుత్వాన్ని కోరింది.

English summary
CID investigat th Birabhum incident that that claimed the lives of 8 people after houses were set ablaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X