సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేకు తీవ్ర అనారోగ్యం.. చికిత్స పొందుతూనే కీలక ప్రకటన!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన టైఫాయిన్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తన ఆరోగ్య పరిస్థితిపై అభిజీత్ దీప్కే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తనకు, వైద్య పరీక్షల అనంతరం టైఫాయిడ్ సోకినట్లు నిర్ధారణ అయిందని దీప్కేవెల్లడించారు. ప్రస్తుతం తనకు ప్రతిరోజూ ఐవీ డ్రిప్స్ ద్వారా మందులు అందిస్తూ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే తన అనారోగ్యం నిరసనపై ప్రభావం చూపదని.. పోరాటం కొనసాగుతుందని కూడా అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఈ పరిస్థితి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జరుగుతున్న ఉద్యమాన్ని నెమ్మదింపజేయదని అభిజీత్ దీప్కే అన్నారు.

CJP Founder Abhijit Dipke Diagnosed with Typhoid amid Dharmendra Pradhan Resignation Protest

సీజేపీ మద్దతుదారులకు కృతజ్ఞతలు
దేశవ్యాప్త ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు సీజేపీ మద్దతుదారులకు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు లక్ష్యాన్ని సాధిస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీప్కే మాట్లాడుతూ, "మీకు తెలిసినట్లుగా, నేను గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. నా మెడికల్ రిపోర్ట్ వచ్చింది, నాకు టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం నా చికిత్స కొనసాగుతోంది. నేను ప్రతిరోజూ డ్రిప్ ద్వారా మందులు తీసుకుంటున్నాను." అని అభిజీత్ దీప్కే తెలిపారు.

పోటీ పరీక్షలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవకతవకలకు నిరసనగా సీజేపీ నేతృత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షా విధానంలో జవాబుదారీతనం, నియామకాలు, ప్రవేశ పరీక్షలలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+