షాక్: ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు, వింటేనే విచిత్రం !
చండీగడ్: ఒకటో తరగతి కుర్రాడు అత్యాచారయత్నం చేశాడని కేసు నమోదు చేసిన విచిత్రమైన సంఘటన హర్యానాలో జరిగింది. ఒకటో తరగతి బాలిక మీద అత్యాచారయత్నం చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.
హర్యానాలోని సిర్సా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక ఒకటో తరగతి చదువుతున్నది. పాఠశాలకు వెళ్లిన బాలిక సోదరుడితో కలిసి ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిందని ఆమె తల్లి అంటున్నది. తన కుమార్తెను అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని బాలిక తల్లి ఆరోపిస్తున్నది.

విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అబ్బాయిల ఫోటోలను ఆసుపత్రిలో ఉన్న బాలికకు చూపించామని, బాలిక తెలిపిన వివరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
ఇదే సమయంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టడం ఏమిటని, అసలు వాళ్లుకు అలాంటి విషయాల గురించి ఏమి తెలుసని విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు నమోదు చేశారని వెలుగు చూడటంతో అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications