దారుణం: స్కూల్లో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్ధిని
బెంగుళూరు: ఐదో తరగతి చదువుతున్న బాలిక తాను చదువుతున్న స్కూలులోనే ఆడ శిశువుకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలోని స్కూల్లో ఐదో తరగతి చదవుతోన్న బాలిక (14)
సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది.
ఆరోగ్యం బాగా లేని గత కొంతకాలంగా చదువుకు బాలిక దూరంగా ఉంది. అయితే ఇటీవలే జూన్ 16న తిరిగి స్కూల్లో చేరింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూలుకు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటాన్ని చూసిన మిగతా విద్యార్ధులు ఉపాధ్యాయురాలికి తెలిపారు.
దీంతో వెంటనే ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. బాత్‌రూంలోనే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు వెంటనే స్కూలు ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. బాలికను వెంటనే హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భవతి అయిన విషయం తమకు ముందే తెలుసని, ఈ విషయం తెలిస్తే స్కూల్లో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని వారు వివరించారు.
తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని బాలిక తల్లిదండ్రులు అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications