కంప్యూటర్ క్లాస్‌లో 8వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ ప్రయివేటు పాఠశాలలోని కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయుడు ఏడో తరగతి విద్యార్థిని పట్ల తరగతి గదిలో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం నాడు బాధిత బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆనంద్ పర్బాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో అతని పైన సదరు పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సదరు ఉపాధ్యాయుడు తమ కూతురుని గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని, తమ కూతురునే కాకుండా ఇంకా మిగతా బాలికలను కూడా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు చెప్పారని తెలుస్తోంది.
తమ కూతురు కంప్యూటర్ క్లాసులకు అటెండ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదని, తాము ప్రశ్నించడంతో తమ కూతురు అసలు విషయం చెప్పిందని ఆ తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు చెప్పారు.
బాధిత బాలిక తల్లిదండ్రులు, ఇతర బాధిత బాలికల కుటుంబ సభ్యులు, ఇతరులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సమాచారం మేరకు కంప్యూటర్ క్లాసుల కోసం యాజమాన్యం ప్రయివేటు కంప్యూటర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిందితుడు కూడా ఓ కంప్యూటర్ సంస్థకు చెందిన వాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications