తీహార్ జైలులో సీఎంకు తీవ్ర అస్వస్థత
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.
కేజ్రీవాల్ కస్టడీ గడువు ఇదివరకే ముగిసినప్పటికీ- దాన్ని మళ్లీ పొడిగించింది రోస్ అవెన్యూ న్యాయస్థానం. 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది.

ప్రస్తుతం ఆయన తీహార్ రెండో నంబర్ జైలు గదిలో ఉంటోన్నారు. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నాలుగున్నర కేజీలు తగ్గినట్లు చెబుతున్నారు. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్. అధిక రక్తపోటు కూడా ఉందాయనకు.
జైలులో సకాలంలో వైద్య సదుపాయాలు అందట్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు. కొద్దిరోజులుగా బ్లడ్ షుగర్ లెవె్ 50 పాయింట్ల కంటే తగ్గిందని విమర్శిస్తోన్నారు. దీన్ని తీహార్ జైలు అధికారులు కొట్టివేస్తోన్నారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని, అవసరమైనప్పుడంతా చికిత్స అందిస్తోన్నామని తెలిపారు.
కాగా- ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తోన్నారు కేజ్రీవాల్. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఇదివరకే ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. హైకోర్టలో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ పిటీషన్ నేడు విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications