కర్ణాటక రైతు కుటుంబానికి అండగా.. రూ.10 లక్షల చెక్కు అందజేత

రైతులు అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానం ఎక్కువ.. ఎప్పుడూ వారి బాగోగుల గురించి ఆలోచన చేస్తారు. చనిపోయిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు రైతుబంధు సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మైసూరులో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామని తెలిపారు.

ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి రైతులు వచ్చారు. వారితో జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్ ఉన్నారు. పర్యటన తర్వాత హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ విమల్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు. అతని కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

cm kcr announces rs.10 lakhs to karnataka farmer family

జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో సభ జరిగింది. తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అన్నదాతల పాలిట వరంగా మారాయని తెలిపారు. ఇక్కడ అమలు అవుతున్న పథకాల గురించి తెలుసుకున్న కర్ణాటక రైతాంగం.. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

10 లక్షల రూపాయల చెక్కును విమల్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు, తెలంగాణ రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+