Bihar లో ఇక గుడ్ గవర్నెన్స్..?!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.
ప్రారంభ ఫలితాల్లో జనతాదళ్ (యునైటెడ్) భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకెళ్తోంది. భారీ ఆధిక్యత సాధించింది. తొలి గంటలోనే ఆ కూటమి మేజిక్ ఫిగర్ ను అందుకుంది. ఆయా స్థానాలన్నింట్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీని సాధించారు. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేస్తోన్నారు.

అలీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని మైథిలీకుమార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిప్లవ్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ ఫలితాల్లో వెనుకపడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్. సంజయ్ కుమార్ సింగ్ ఇక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొకామాలో బాహుబలి అనంత్ సింగ్, తారాపూర్ లో సామ్రాట్ చౌదరి, దానాపూర్ లో కేంద్ర మాజీ మంత్రి కృపాల్ యాదవ్, బేతియాలో మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించారు.
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తేజస్వీ యాదవ్ స్పందించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాము గెలవబోతున్నామని తేల్చి చెప్పారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తోన్నానని అన్నారు. రాష్ట్ర అధికారంలో పెను మార్పు రాబోతోందని, చివరి వరకూ ఫలితాల కోసం ఎదురు చూడాలని సూచించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు తేజస్వి యాదవ్ తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, సోదరి, లోక్‌సభ ఎంపీ మీసా భారతితో కలిసి పాట్నాలోని తన నివాసం వద్ద పార్టీ అభిమానులను కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన రాఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేశారు. నితీష్ కుమార్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగివేసారిపోయారేని, అందుకే మార్పు కోరుకుంటోన్నారని అన్నారు.
ఈ ఫలితాలపై అటు జనతాదళ్ (యునైటెడ్) స్పందించింది. ఇంకొన్ని గంటల్లో రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన రాబోతోందని ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. మరోమారు బీహార్ ను పురోగమింపజేస్తామని, డబుల్ ఇంజిన్ సర్కార్ పునరావృతం కాబోతోందని పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టిస్తామని తెలిపింది. తమ పార్టీకి ఆధిక్యతను అప్పగించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications