సుప్రీం తీర్పు ఎఫెక్ట్: సీఎం యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది?
బెంగళూరు: సుప్రీంకోర్టు బలనిరూపణ ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు.
యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు.

అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేసినట్లు తెలుస్తోంది.
కాగా, శనివారం సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న విషయం తెలిసిందే. అధికారంలో కొనసాగేందుకు బీజేపీ తనకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కూడా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
Menstrual Leave: మహిళలకు పీరియడ్ సెలవులపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! కీలక వ్యాఖ్యలు..! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications