సీఎం సంచలన నిర్ణయం, ప్రజల ఖాతాల్లోకి నేరుగా ఎన్ని వేల కోట్లు అంటే ?, ఆ సీట్లు టార్గెట్, మోదీకి చెక్ ?
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసిన ఉచిత హామీ పథకాలను అమలు చేయడంతోపాటు వాటిని ఎన్నికల ట్రంప్ కార్డులుగా ఉపయోగించుకునేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించింది. లక్షలాది మంది లబ్ధిదారులకు గ్యారంటీ స్మార్ట్ కార్డ్ (గ్యారంటీ స్మార్ట్ కార్డ్ ఆఫ్ కాంగ్రెస్) పంపిణీ చెయ్యాలని సిద్దరామయ్య ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఉచిత హామీ పథకాలను అమలు చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని 4.5 కోట్ల మందికి ఇంటింటికీ గ్యారెంటీ స్మార్ట్ కార్డ్‌లను పంపిణీ చేసే ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సేవలను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు డిసైడ్ అయ్యారని తెలిసింది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఉచిత హామీల పథకాలనే అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ ఆ పార్టీ పదాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తదుపరి ప్రణాళిక కార్యక్రమాలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రణదీప్‌సింగ్ సూర్జేవాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హామీ పథకాల అమలును దృష్టిలో ఉంచుకుని 2024 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ సీటును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది.
స్మార్ట్‌కార్డుల పంపిణీ, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటికీ స్మార్ట్ కార్డులు అందజేయడం వంటి కార్యక్రమాలతో పాటు కార్యకర్తల సేవలను అన్ని విదాలుగా ఉపయోగించుకోవాలని చర్చించారు. దీంతో పాటు మొత్తం 5, 000 మంది కార్యకర్తల సహాయంతో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఐదు ఉచిత హామీ పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు వేయాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.
దీని ద్వారా పార్టీ కార్యకర్తలకు కొత్తగా బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రభుత్వంలో వారిని భాగం చేసి లోక్ సభ ఎన్నికల్లో వారిని భాగస్వామ్యం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుందనే సందేశం అందుతుందని, ఈ ఆలోచనలన్నీ పార్టీ ఉన్నత స్థానానికి చేరుకోవడంలో దోహదపడతాయని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఉచిత హామీ పథకానికి సంబంధించి జిల్లా, అసెంబ్లీ స్థాయిలో లబ్ధిదారుల నుంచి సమావేశం నిర్వహించి సమాచారం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సమావేశం అనంతరం డీసీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తాను సంతృప్తి చెందలేదని,. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, నేను, ఏఐసీసీ నేతృత్వంలో విడివిడిగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
ఉచిత హామీ పథకంతో సహా ప్రజలకు ఇంత చేసినా లోక్ సభ ఎన్నికల్లో గెలవకపోతే మనకే ఎదురుదెబ్బ తగులుతుందని. కాబట్టి ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల తరువాత నిరాశ చెందే అవాశం ఎదురుకాకుండా ఉండటానికి ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కర్ణాటకలో కనీసం 26 లోక్ సభ సీట్ల లో గెలిచేలా పని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మనవి చేశారని డీకే శివకుమార్ వివరించారు.












Click it and Unblock the Notifications