కాగ్నిజెంట్ టెక్నాలజీలో ముగ్గురు కొత్త డైరెక్టర్లు, ఇన్వెస్టర్లకు రూ.22,831 కోట్లు
ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్ప్ తన కంపెనీల్లో కొత్త డైరెక్టర్లను నియమించుకొంది. ఇరియంట్ మేనేజ్ మెంట్ ఇత్తిళ్ళకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకొనేందుకు సమ్మతించింది.
బెంగుళూరు:ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకొంది.తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియంట్ మేనేజ్ మెంట్ ఒత్తిళ్ళకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకొనేందుకు సమ్మతించింది.

ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ,22,831 కోట్లను తిరిగి ఇవ్వడానికి సమ్మతించింది.నవంబర్ లో ఇలియట్ కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్ హోల్డర్ విలువను పెంచేందుకు ఈ ఐటి సర్వీస్ ప్రోవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుండో వాదిస్తోంది.
ఈ మేరకు ఒత్తిళ్ళకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్ళలో షేర్ హోల్డర్స్ కు రూ.22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్ ను బుదవారం ఆమోదం తెలిపింది.షేర్ల బై బ్యాక్ , డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్ కు కేటాయించనుంది.
201718 ఆర్థిక సంవత్సరంలో తొలి క్వార్టర్ లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను రెండో క్వార్టర్ లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పున:కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications