College girl: ప్రియుడి మోజులో పడి ఎంత పని చేసింది ?, సర్వం స్వాహా, దెబ్బకు ప్రియుడి మైండ్ బ్లాక్ !
బెంగళూరు: కాలేజ్ కు వెలుతున్న కూతురుకు ఏమి కావాలన్నా ఆమె తల్లిదండ్రులు తీసిస్తున్నారు. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న కూతురు సాయంత్రం చాలా సంతోషంగా ఇంటికి వస్తోంది. కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఇంట్లో దేవుడి పూజ కోసం ఇంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం తీసి దేవుడి దగ్గర పెట్టి పూజలు చేశారు. పూజలు పూర్తి అయిన తరువాత బంగారు నగలు, లక్ష రూపాయలకు పైగా నగదు తీసి కబోడ్ లో పెట్టారు. కొన్ని రోజులకే బంగారు నగలు, నగదు లూటీ అయ్యాయి. ఇంట్లోకి బయట వాళ్లు ఎవ్వరూ రాలేదని, తెలిసిన వాళ్లు చోరీ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే బంగారు నగలు, నగదు లూటీ చేసింది ఎవరు అనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్ అయ్యి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలేజ్ కు వెలుతున్న కూతురు
బెంగళూరులోని బాగలుకుంటేలో శ్రీనివాసులు (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శ్రీనివాసులుకు 20 ఏళ్ల వయసు ఉన్న రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే కూతురు ఉంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో శ్రీనివాసులు కూతురు రాజేశ్వరి డిప్లొమో చదువుకుంటున్నది.

కూతురు ఏం కావాలన్నా ఇచ్చారు
కాలేజ్ కు వెలుతున్న కూతురు రాజేశ్వరికి ఏమి కావాలన్నా ఆమె తల్లిదండ్రులు తీసిస్తున్నారు. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్నరాజేశ్వరి సాయంత్రం చాలా సంతోషంగా ఇంటికి వస్తోంది. మా కూతురు రాజేశ్వరి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మంచి పెళ్లి కొడుకుని చూసి ఆమెకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.

ఇంట్లో పూజలు చెయ్యాలని
శ్రీనివాసులు ఇంట్లో నవంబర్ 29వ తేదీన ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 130 గ్రాముల బంగారు నగలు, 1 లక్షా 10 వేల రూపాయల డబ్బులు దేవుడి గదిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు పూర్తి అయిన తరువాత శ్రీనివాసులు, అతని భార్య దేవుడి దగ్గర ఉన్న బంగారు నగలు, లక్షా 10 వేల రూపాయల నగదు తీసి కబోడ్ లో పెట్టారు.

బంగారు నగలు, నగదు మాయం
కొన్ని రోజులకే బంగారు నగలు, నగదు లూటీ అయ్యాయి. ఇంట్లోకి బయట వాళ్లు ఎవ్వరూ రాలేదని, తెలిసిన వాళ్లు చోరీ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను శ్రీనివాసులు ప్రశ్నించాడు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న రాజేశ్వరి ఓ యువకుడితో తిరుగుతోందని ఇదే సమయంలో ఆమె తండ్రి శ్రీనివాసులుకు తెలిసింది.

బిత్తరపోయిన పోలీసులు, కుటుంబ సభ్యులు
కూతురు రాజేశ్వరిని ఆమె తండ్రి మర్యాదగా అసలు విషయం చెప్పాలని కొన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు. తన కూతురు రాజేశ్వరి ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఓ అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో తానే ఇంట్లో బంగారు నగలు చోరీ చేసి తన ప్రియుడికి ఇచ్చానని రాజేశ్వరి అంగీకరించింది.
Recommended Video

ప్రియుడి మోజులో పడి ఎంత పని చేసింది ?
శ్రీనివాసులు అతని కూతురు రాజేశ్వరి ప్రియుడి మీద పోలీసు కేసు పెట్టారు. పోలీసులు కాలేజ్ అమ్మాయి ప్రియుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో బంగారు నగలు, నగదు లూటీ చేసింది తమ కూతురే అని అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications