నడిరోడ్డుపై కీచక పర్వం, విద్యార్థినిని చుట్టుముట్టి.. వేధిస్తూ.. వీడియో తీసి...

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్ : కొంతమంది కీచకులు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ కాలేజీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశారు. అంతే కాదు, సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఆ పనికిమాలిన చర్యను వీడియో కూడా తీశారు.

ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరిగిన అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా డిసెంబర్ 3న వెలుగులోనికి వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సుమారు 10 మందికిపైగా యువకులు కీచక పర్వానికి పాల్పడ్డారు.

College Girl Molested in Odisha; Police Arrest 6 as Video Goes Viral

కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న ఆ విద్యార్థినిని యువకులు గుంపుగా చుట్టుముట్టారు. ఆమెను కామెంట్ చేస్తూ.. వేధింపులకు గురిచేశారు. దుస్తులు లాగడానికి యత్నించారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.

ఆ విద్యార్థినితోపాటు ఉన్న యువకుడిని చితకబాదారు. తమను వదిలేయమంటూ ఆమె ప్రాధేయపడినా ఆ కీచక యువకులు కనికరించలేదు, వినిపించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనే ఆ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిగిరిలో కూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించగా, బాధిత యువతిని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా సందర్శించి ఓదార్చారు. ఆ తరువాత ఆమెను సీఎం చంద్రబాబు వద్దకు కూడా తీసుకొచ్చి స్వేచ్ఛగా చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police have arrested six people after a video of a girl being molested on her way back from college in Odisha went viral over the Internet. The police arrested four main accused and two of their associates on December 3 even as the incident reportedly took place on October 4 in Odisha’s Paikmal area. The video shows the men, with their faces covered with cloth, molesting the girl. The men also beat up the girl’s male friend. The video shows the girl pleading to the men to leave them while the men continue to assault her and her friend. One of the men was making the video of the shameful incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి