daughter: కాలేజ్ అమ్మాయికి అదేపని, రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ లు, గర్బవతి, తల్లికి తెలిసి ఏం చేసిందంటే ?
కూతురు కాలేజ్ కు వెళ్లిన తరువాత ఆమె రూమ్ లో తల్లి సోదాలు చేసింది. కాలేజ్ అమ్మాయి రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ లు లభ్యం కావడంతో అమ్మాయి తల్లి హడలిపోయింది. కాలేజ్ అమ్మాయి తల్లిదండ్రులు, ఇద్దరు మేనమామలు ఓ స్కెచ్ వేశారు.
లక్నో/ఉత్తరప్రదేశ్: డిగ్రీ చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి ఎక్కువగా ఓ రూమ్ లో ఉంటూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోంది. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు అని తల్లిదండ్రులు ప్రశ్నించగా మా కాలేజ్ అమ్మాయిలతో అంటూ ఇంతకాలం ఆ యువతి కాలం గడుపుతూ వచ్చింది. కూతురు కాలేజ్ కు వెళ్లిన తరువాత ఆమె రూమ్ లో తల్లి సోదాలు చేసింది. కాలేజ్ అమ్మాయి రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ లు లభ్యం కావడంతో అమ్మాయి తల్లి హడలిపోయింది. కొన్ని రోజులకే కూతురు గర్బవతి అని తెలుసుకున్న ఆమె తల్లి ఆందోళన చెందింది. కాలేజ్ అమ్మాయి తల్లిదండ్రులు, ఇద్దరు మేనమామలు కలిసి ఓ స్కెచ్ వేశారు. కాలేజ్ అమ్మాయి శవం ఆనవాళ్లు కూడా చిక్కకుండా చెయ్యడం కలకలం రేపింది.

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు
కాలేజ్ అమ్మాయి గదిలో ప్రెగ్నెన్సీ కిట్ చిక్కడంతో రగిలిపోయిన ఆమె తల్లిదండ్రులు వాళ్ల 21 ఏళ్ల కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో చోటుచేసుకుంది. బంధువుల సాయంతో కూతురి శవాన్ని మాయం చేశారు. కూతురి గదిలో ప్రెగ్నెన్సీ కిట్ దొరికిందన్న కారణంతో తల్లిదండ్రులు ఆమెను హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని పోలీసులతో పాటు ఎవ్వరూ గుర్తించకుండా యాసిడ్ పోసి ఆనవాళ్లు ఏమాత్రం చిక్కకుండా చేసి మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో పడేశారు.

కూతురు కనపడలేదని మిస్సింగ్ కేసు
ఫిబ్రవరి 3నవ తేదీన అలమాబాద్ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి తన కుమార్తె నిషా కాలేజ్ కు వెళ్లిన తరువాత ఇంటికి తిరిగి రాలేదని, ఆమె కోసం చాలా చోట్ల వెతికినా ఆమె కనపడటం లేదని, మా కూతురి ఆచూకి తెలుసుకోవాలని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేష్ పోలీసు కేసు పెట్టిన రెండు రోజుల తరువాత ఓ గ్రామం సమీపంలోని నీటి కాలువలో ఒక యువతి మృతదేహం బయటపడింది.

కూతుర్ని మేమే హత్య చేశాము
యువతి శవం ఆసుపత్రికి తరలించిన తరువాత పోలీసులకు అనుమానం వచ్చి నరేష్‌తో పాటు అతని భార్య శోభాదేవిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా విచారించారు. పోలీసుల విచారణలో నరేష్, శోభాదేవి దంపతులు పొంతనలేకుండా పోలీసులకు సమాధానం ఇచ్చారు. పోలీసులు నరేస్ కు బెండ్ తీశారు. ఆ సమయంలో నరేష్, శోభా దేవి దంపతులు వారి కుమార్తె నిషాను హత్య చేశామని అంగీకరించారని పోలీసు అధికారులు తెలిపారు.

కాలేజ్ అమ్మాయి రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ లు, నిరోధ్ లు
ఫిబ్రవరి 3న మా కుమార్తె నిషాను మేమే హత్య చేసినట్లు నరేష్, శోభాదేవి దంపతులు అంగీకరించారని పోలీసు అధికారులు తెలిపారు. నిషా మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టకుండా, ఆమె శవం కూడా చిక్కకుండా చెయ్యాలని శవం మీద యాసిడ్ పోసి కాల్చేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. మా కూతురు నిషా రూమ్ లో ప్రెగ్నెన్సీ కిట్ లు చిక్కడం వలనే కోపంతో ఆమెను చంపేశామని నిందితులు నరేష్, శోభాదేవి అంగీకరించారని పోలీసు అధికారులు తెలిపారు.

కూతురికి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ?
మా కూతురు నిషా చాలా మంది అబ్బాయిలతో మొబైల్ ఫోన్ లో మాట్లాడేదిని, ఆమెకు అనేక మంది అబ్బాయిలో అక్రమ సంబంధాలు ఉన్నాయనే సందేహం కూడా మాకు వచ్చిందని, నిషాను ప్రశ్నిస్తే మాకే ఎదురుతిరగడం మొదలుపెట్టిందని ఆమె తల్లిదండ్రులు నరేష్, శోభాదేవి పోలీసులకు చెప్పారు. నిషా రూమ్ లో ఆమె తల్లిదండ్రులు ప్రెగ్నెన్సీ కిట్‌లను చూశారు. దీంతో మా కుమార్తెకు అనేక మంది అబ్బాయిలతో శారీరక సంబంధాలు ఏర్పడి ఉండవచ్చని తండ్రి నరేష్ అనుమానం వ్యక్తం చేశాడు. ప్రజల ముందు తన పరువు పోతుందన్న కోపంతో నరేష్ తన కూతురిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక ఎస్పీ మీడియాకు చెప్పారు.

రెండో కూతుర్ని డిగ్రీ చదివిస్తున్న తండ్రి
నిషాను హత్య చేసిన తరువాత హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు చేసిన పని అంతా ఇంట్లోనే జరగడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. నిషాను ఆమె తల్లిదండ్రులతో పాటు యువతి ఇద్దరు మేనమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ అతని రెండో కుమార్తె నిషాను బీఏ చదివిస్తున్నాడని, అయితే కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి చాలా మంది అబ్బాయిలతో కలిసి తిరుగుతోందని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీశారని పోలీసు అధికారులు అంటున్నారు.

కూతురు గర్బవతి అని తల్లికి తెలిసిపోయింది
నిషా అబ్బాయిలతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని ఆమె తల్లిదండ్రులతో ఇంతకు ముందే వాగ్వివాదం కూడా జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇంతలో నిషా గర్భవతి అని ఆమె తల్లి శోభాదేవికి తెలిసింది. ఎందుకు ఇలా చేశావు అని కూతుర్ని నిలదీస్తే నిషా ఆమె తల్లి శోభాదేవికి ఎదురు తిరిగిందని, ఇదే వియంలో గొడవ పెద్దది అయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు. గర్భవతి అయిన నిషా తాను అబార్షన్ చేయించుకుంటానని, ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారని తల్లిదండ్రులను ఎదిరించడంతో మేనమామలు జోక్యం చేసుకున్నారని పోలీసులు అన్నారు. ఇంత గొడవలకు కాణం అయిన నిషాను ఆమె తల్లిదండ్రులతో పాటు ఇద్దరు మేనమామలు దారుణంగా హత్య చేశారని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధాల కారణంగా కాలేజ్ అమ్మాయి ఆమె తల్లిదండ్రుల చేతిలోనే హత్యకు గురి కావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications