Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇవి కంపెనీస్ అంటే.. దీపావళి కానుకగా ఉద్యోగులకు కార్లు, అపార్ట్‌మెంట్స్ !!!

సాధారణంగా పండుగ సీజన్‌లో బోనస్‌లు, గిఫ్ట్‌లు ఇవ్వడం సర్వసాధారణం. దీపావళి పండుగను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి భారతీయ కంపెనీలు తమ సిబ్బందికి ఇచ్చిన విశేష కానుకలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..

'మిట్స్ నేచురా' - 51 కార్లు..

హరియాణా రాష్ట్రం పంచకులాలో కేంద్రంగా ఉన్న ఔషధ తయారీ సంస్థ 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Ltd) యజమాని ఎం.కె. భాటియా దీపావళి సందర్భంగా మరోసారి తన ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ఎప్పటిలా ఈ ఏడాది కూడా భాటియా తన సిబ్బందికి బహుమతులు అందజేశారు. కానీ ఈసారి రికార్డు స్థాయిలో ఏకంగా 51 మంది ఉద్యోగులకు కొత్త కార్ల తాళాలు అందించారు. భాటియా చేతులమీదుగా కొత్త కారు కీలు స్వీకరించిన ఉద్యోగులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

companies-giving-cars-and-apartments-as-diwali-gifts-for-employees

అనంతరం ఉద్యోగులు తమ కొత్త కార్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పంచకులా వీధులన్నీ మెరిసే కార్లతో నిండిపోగా, ప్రజలు ఆ ర్యాలీని ఆసక్తిగా వీక్షించారు. భాటియా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ఉద్యోగుల కష్టమే మిట్స్ నేచురా విజయానికి పునాదని పేర్కొన్నారు. బహుమతులు ప్రదర్శన కోసం కాదని.. టీమ్ స్పిరిట్ పెంచే ప్రయత్నం అని అన్నారు. కంపెనీ సిబ్బంది భాటియాను బాస్ కాదని.. తమ ఫ్యామిలీ మెంబర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

400 అపార్ట్‌మెంట్‌లు..

అలానే ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన మరో పేరు సావ్జీ ధోలాకియా. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి, తన సంస్థ హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ (Hare Krishna Exports) ద్వారా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా అద్భుతమైన బహుమతులు ఇస్తారు. ఈసారి ఆయన కంపెనీ ఉద్యోగులకు 400 అపార్ట్‌మెంట్‌లు బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఫ్లాట్ 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, సౌకర్యవంతమైన చెల్లింపుల ప్రణాళికతో అందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు..

తమిళనాడులోని కోటగిరి టీ ఎస్టేట్ యజమాని కూడా ఈసారి ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పండుగ సందర్భంగా 15 మంది ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు బహుమతిగా అందజేశారు. ఒక్కో బైక్ విలువ రూ. 2 లక్షలకు పైగా ఉండగా, యజమాని స్వయంగా తాళాలు ఇచ్చి, సిబ్బందిని విహారయాత్రకు తీసుకెళ్లాడు.

8 కార్లు, 18 బైకులు..

చెన్నైలోని ప్రసిద్ధ చల్లాని జ్యువెలరీ కూడా దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు బహుమతుల వర్షం కురిపించింది. సంస్థ యజమాని జయంతిలాల్ చయంతి షాప్ ఫ్లోర్ నుండి మేనేజర్ స్థాయివరకు ఉన్న ఉద్యోగులకు 8 కార్లు, 18 బైకులు బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ల మొత్తం విలువ దాదాపు రూ. 1.2 కోట్లు. గిఫ్ట్‌లు స్వీకరించిన ఉద్యోగుల కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.

మొత్తానికి ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారతదేశంలోని పలు కంపెనీలు ఉద్యోగులకు సంతోషం కలిగించే విధంగా ఇంత భారీ మొత్తంలో కానుకలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+