చైనాతో బోర్డర్ టెన్షన్స్... కిమ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ.. సీన్‌లోకి ఆ నియంత ఎందుకు..?
లదాఖ్ సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చైనా గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం.. డ్రాగన్ కంట్రీ అత్యుత్సాహాన్ని బయటపెట్టింది. చైనా వివాదాస్పద తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోనూ స్థానిక బీజేపీ నేతలు చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే అక్కడి బీజేపీ నేతల అవగాహనరాహిత్యం వారిని అభాసుపాలయ్యేలా చేసింది. ఇంతకీ ఏం చేశారో తెలుసా...
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
— Lavanya Ballal | ಲಾವಣ್ಯ ಬಲ್ಲಾಳ್ (@LavanyaBallal) June 18, 2020
pic.twitter.com/OlpjHDj1ej

చైనా ప్రధాని కిమ్ జోంగ్.. బీజేపీ నేతల పొరపాటు...
అసన్‌సోల్‌లో స్థానిక బీజేపీ కార్యకర్తలు చైనాకు వ్యతిరేకంగా గురువారం(జూన్ 18)న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మకు బదులు,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఓ బీజేపీ కార్యకర్త మీడియాతో మాట్లాడుతూ... చైనా ప్రధానమంత్రి కిమ్ జోంగ్ ఉన్ అని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చైనా వస్తువులను ఉపయోగించవద్దని,స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని పిలుపునిచ్చాడు. కన్ఫ్యూజన్‌లో అనేశాడో లేక తెలియక అన్నాడో తెలియదు గానీ కిమ్ జోంగ్ ఉన్‌ను చైనా ప్రధానమంత్రిగా ఆ బీజేపీ నేత పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్
'బీజేపీ ప్రకారం.. చైనా ప్రధానమంత్రి కిమ్ జోంగ్ ఉన్ అన్నమాట. అంటే,ఉత్తర కొరియా చైనాను ఆక్రమించుకుందా..?' అంటూ ఓ నెటిజన్ సందేహం వెలిబుచ్చాడు. 'డియర్ నెట్‌ఫ్లిక్స్ఇండియా.. మీ వెబ్ ప్లాట్‌ఫామ్‌లో మేడ్ ఇన్ చైనా మూవీని తొలగించండి. లేదంటే నేను కూడా కిమ్ జోంగ్ ఉన్ విగ్రహాన్ని తగలబెట్టేస్తాను.' అంటూ మరో నెటిజన్ ఫన్నీ ట్వీట్ చేశాడు. 'ఇంకా నయం చైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనలేదు..ఆ దెబ్బకు మోదీ మూర్చపోయేవాడు..' అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశాడు.

నేడు అఖిలపక్ష సమావేశం..
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు,43 మంది చైనా సైనికులు మృతి చెందారు. అమరులైన భారత సైనికులకు గురువారం సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు చైనా మిలటరీ అధికారులతో భారత్ మిలటరీ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. చైనా కవ్వింపు చర్యలను ఎలాంటి వ్యూహంతో ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటున్నారు.
Recommended Video
According to BJP, China's 'Prime Minister' is Kim Jong.
— Sangram Satpathy (@sangramsatpath9) June 18, 2020
So North Korea has annexed China or what? https://t.co/nHUHUGKlsq
-
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications