ఎంపీ మృతి: బడ్జెట్ ప్రవేశపెట్టడంపై తేల్చేసిన స్పీకర్, రాష్ట్రపతి వద్దకు జైట్లీ
మాజీ కేంద్రమంత్రి, పార్లమెంటుసభ్యుడు అహమద్ మృతితో బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సందిగ్ధత ఏర్పడింది. పాత సాంప్రదాయం ప్రకారం అయితే సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా .
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, పార్లమెంటుసభ్యుడు అహమద్ మృతితో బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది. పాత సాంప్రదాయం ప్రకారం అయితే సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

రాష్ట్రపతి వద్దకు జైట్లీ
బడ్జెట్ పత్రాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం వెళ్లారు. ఎంపీ మృతి నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలా? వద్దా అనే అంశంపై ఆయనతో మంత్రి చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, పార్లమెంటుకు బడ్జెట్ పత్రాలు చేరుకున్నాయి.
బడ్జెట్ యథాతథం: తేల్చేసిన స్పీకర్
బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్టీలకు స్పష్టత ఇచ్చారు. బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని పార్టీలకు స్పీకర్ కార్యాలయం తెలియజేసింది.
గుండెపోటుతో ఎంపీ మృతి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఐయూఎంఎల్ ఎంపీ ఇ.అహ్మద్ స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి వైద్య బృందలోని వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి చికిత్స పొందుదూ ఆయన మృతిచెందారు.
ఇ.అహ్మద్ మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఎంపీ మృతి పట్ల సంతాపం తెలిపిన అనంతరం పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications