వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు : కాంగ్రెస్ పార్టీ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం ఇంచార్జ్ , ప్రముఖ ఆర్థికవేత్త శ్యామ్ పింట్రోడ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ ,బీజేపీల మధ్య రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో శ్యామ్ పిట్రోడా కూడ స్పందించారు. అయినా బీజేపీ నేతలు మాత్రం మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో శ్యామ్ పింట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

 శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరీకి నిదర్శం :ప్రధాని

శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరీకి నిదర్శం :ప్రధాని

సిక్కుల ఉచకోతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ అయిన శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే..ఈ అంశంపై బీజేపీ పెద్ద ఎత్తున ఎదురు దాడికి దిగింది. గతంలో జరిగిన అంశాలు ప్రజలకు తెలియవని పేర్కోంటున్న నేతలు శ్యామ్ పింట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శమని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు..

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ..కాంగ్రేస్ పార్టీ

శ్యాంపిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ..కాంగ్రేస్ పార్టీ

పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ .. వ్యక్తులు చేసే ప్రకటనలకు పార్టీకి సంబంధం లేదని అవి వారి వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈనేపథ్యంలోనే పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇక 1984తోపాటు 2002 జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి న్యాయం జరగాల్సిన అవసం ఉందని,కాని బాధితులకు న్యాయం జరగాలని బీజేపీ కోరుకోకపోవడంతో పాటు సిక్కుల అల్లర్ల అంశంపై ఓట్లను రాబట్టే పనిలో ఉందని ఓ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

సోనియా గాంధి క్షమాపణ చెప్పాలి..

సోనియా గాంధి క్షమాపణ చెప్పాలి..

శ్యామ్ పింట్రోడా చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలతోపాటు మంత్రులు సైతం రంగంలోకి దిగారు. ఈ వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడను పార్టీ పదవినుండి తోలగిస్తారా లేదా అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే పింట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నిదర్శనమని అన్నారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు. కాగా పిట్రోడా వ్యాఖ్యలపై సోనియా గాంధి సైతం క్షమాపణాలు చెప్పాలని మరో మంత్రి ప్రకాశ్ జవడేకర్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రేస్ పార్టీ అనుసరించిన విధానాలకు సిక్కుల ఊచకోత ఒక ఉదహారణ అని వీటీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన పింట్రోడా అని ప్రకటించిన శ్యామ్ పిట్రోడా

నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన పింట్రోడా అని ప్రకటించిన శ్యామ్ పిట్రోడా

పిట్రోడా వ్యాఖ్యలు త్వరలో జరగనున్న ఢిల్లి ఎన్నికలపై పడే ప్రమాదం ఉన్న నేపథ్యంతో పాటు ,పెద్ద ఎత్తున దుమారం రేగడంతో శ్యామ్ పిట్రోడా దిగివచ్చారు. సిక్కుల ఉచకోతకు సంబంధించిన తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాలు కాదని ప్రకటించారు. ఈనేపథ్యంలో నా వ్యాఖ్యల్ని కాంగ్రేస్ పార్టీ వక్రీకరిస్తుందని శ్యామ్ పిట్రోడా అన్నారు. కాగా బీజేపీ తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికే పదేపదే ఒకే మాటలను తీసుకుని ప్రచారం చేస్తుందని అన్నారు. అయినా వాటిపై తాను విచారం వ్యక్తం చేశానని అన్నారు. సిక్కుల ఉచకోత తనను ఎంతగానో కలచివేసిందని ,అయినా అప్పటి సంఘటన ఇప్పటి ఎన్నికల్లో ఎందుకని మాత్రమే అన్నానని ఆయన స్పష్టం చేశారు.వీటిని బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తుందని అన్నారు.

ఇంతకీ శ్యామ్ పింట్రోడా ఏమన్నాడు

ఇంతకీ శ్యామ్ పింట్రోడా ఏమన్నాడు

ఓ ప్రయివేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో శ్యామ్ పింట్రోడా మట్లాడుతూ ...1984 లో జరిగిన సిక్కుల ఉచకోత ఆదేశాలు అప్పటి ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ కార్యాలయం నుండే వచ్చాయని బీజేపీ నేతలు ట్వీట్ చేశారు. అయితే వాటిపై స్పందించిన శ్యామ్ పిట్రోడా అప్పటి సమస్య ఇప్పుడెందుకు, అయితే ఏంటీ అంటూ సమాధానం ఇస్తూనే..1984 లో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ హాయంలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన శిరోమణి అకాలీదల్ పెద్దఎత్తున్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం స్పందిస్తున్నారు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది.

English summary
Lacerated over the comments of its top leader Sam Pitroda on the 1984 anti-Sikh riots on the verge of voting in Delhi for the national election, the Congress today distanced itself from "remarks made by any individual" and cautioned its leaders to be careful."Any remark made by any individual is certainly not the opinion of the party," the Congress said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X