రాజస్థాన్‌లో కాంగ్రెస్ నిష్క్రమణ చారిత్రక అవసరం: ప్రధాని మోడీ
జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అధికార, ప్రతిపక్షాల ప్రచార హోరు రెట్టింపు అయ్యింది. అధికార కాంగ్రెస్‌ను గద్దెదించేందుకు బీజేపీ అగ్రనాయకులు రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ చేసిన రాజకీయ ప్రసంగం అక్కడి కాషాయదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ చేసిన అన్ని "తప్పుడు వాగ్దానాల" కంటే తాను ఇచ్చే హామీ చాలా ఎక్కువ అని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నొక్కి చెప్పారు.
రాష్ట్రాన్ని అవినీతి నుండి విముక్తి చేయడానికి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని సాగనంపాలని రాజస్థాన్ ప్రజలను కోరారు. పేదలు, ప్రజల సంక్షేమంపై కాంగ్రెస్ తప్పుడు విధానాలు ఎక్కడినుంచి ముగుస్తుందో మోదీ హామీ అక్కడి నుంచి మొదలవుతుందని ఆయన అన్నారు. దుంగార్‌పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ దుష్టపాలనను అంతమొందించేందుకు ప్రజాస్వామ్యం రాజస్థాన్ ప్రజలకు అవకాశం ఇచ్చిందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు.

రాజస్థాన్‌ను విముక్తి చేయండి :"కాంగ్రెస్‌ను తడిమికొట్టి.. అల్లర్లు, అవినీతి నుండి రాజస్థాన్‌ను విముక్తి చేయండి. కేంద్ర పథకాలను త్వరగా అమలు చేయడానికి కాంగ్రెస్ నిష్క్రమణ చారిత్రక అవసరం" అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో ప్రతి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం "స్కామ్" చేసిందని ఆయన విమర్శించారు. ఇలాంటి స్కామ్ ప్రతి రిక్రూట్‌మెంట్‌లోనూ జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల మధ్య ఇలాంటి వ్యాపారం జరుగుతోందని దుయ్యబట్టారు.
వారి పిల్లలు అధికారులు అయ్యారని, మీ పిల్లలను నిర్ధాక్షణ్యంగా రోడ్డునపడేలా చేశారని ద్వజమెత్తారు. యువత ఆలోచించాలని కోరారు. గెహ్లాట్ ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాదని, రాజస్థాన్ ప్రజలు దీనిని గమనించాలని ఆయన అన్నారు. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ చేసిన ఈ వాఖ్యలు పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications