రాహుల్ యాంగిల్స్ కాంగ్రెస్ ట్వీట్, బీజేపీ కౌంటర్: దిక్కులు చూస్తూ.. నెటిజన్ల సెటైర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్‌ను బీజేపీ రీట్వీట్ చేసింది. అంతేకాదు, ఈ దీనిని రీట్వీట్ చేయకుండా ఉండలేకపోయామని అభిప్రాయపడింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెందిన నాలుగు ఫోటోలతో ఓ ట్వీట్ చేసింది.
జర్మన్ ఫెడరల్ పార్లమెంటు.. బండ్స్‌టాగ్‌లో పలు ఫోటోలు దిగారు. ఇందులో నాలుగు ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ పలు కోణాలు (ముఖకవళికలు) అంటూ క్యాప్షన్ పెట్టింది.
The many facets of Rahul Gandhi. #Bundestag pic.twitter.com/MtoNs1TxjO
— Congress (@INCIndia) August 23, 2018
అందులో రాహుల్ గాంధీ పైకి చూస్తున్నట్లు, పక్కలకు చూస్తున్నట్లు.. ఇలా వివిధ కోణాల్లో ఫోటోలు దిగారు. దీనిని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది. దీనిని వెంటనే రీట్వీట్ చేయకుండా ఉండలేకపోయామని పేర్కొంది.
Hahahahaha. Congress tweeting Rahul Gandhi's upcoming Meme Material https://t.co/JhtnQ8S95A
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) August 23, 2018
కాగా, దీనిపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీయే తమ పార్టీపై సెటైర్లు వేసుకుంటుందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అని ఒకరు, మీ విజన్ ఏమిటి అని భారతీయులు రాహుల్‌ను అడిగితే దిక్కులు చూస్తున్నారని మరొకరు ట్వీట్ చేశారు.
That reaction when people of india ask from @RahulGandhi what is your visions for India's future pic.twitter.com/CTT5gsd5sB
— Bhrustrated® (@AnupamUncl) August 23, 2018
ఇదిలా ఉండగా, జర్మనీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జర్మనీలో పర్యటిస్తున్న రాహుల్.. హాంబర్గ్‌లో మాట్లాడుతూ.. ఎన్డీయే పాలనలో భారత్‌లో నిరుద్యోగం, అసమానతలు, మూక హత్యలు అఝికమయ్యాయని, ఐసిస్ వంటివి ఏర్పడుతాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ పాలనలో దేశ ద్రోహ చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలకు కళ్లెం పడిందని, కానీ, రాహుల్ గాంధీకి ఇవేవీ కనపడడం లేదని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లాజిక్ ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. 50 నెలల మోడీ పాలనలో దేశ ద్రోహ చర్యలు, వేర్పాటు వాద కార్యకలాపాలకు కళ్లెం పడిందన్నారు.
బీజేపీ నేత సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ దేశాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు సరికావన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాకపోతే తమ మైనార్టీలు ఐసీస్‌కు అమ్ముడుపోతారన్నట్లుగా రాహుల్ మాట్లాడటం, వారిని కించపరచడమే అన్నారు. ఆయన చెప్పిన మాటలు అన్నీ అసత్యాలే అన్నారు. సరైన సమాచారం లేకుండానే ఆరోపణలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications