అత్త అంగీకరిస్తే కోడలికి ప్రతినెల ఫ్రీగా డబ్బులు ఇస్తామని చెప్పిన సిద్దూ, జరిగేపనేనా ?

బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలను చిత్తు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గ్యారెంటీల తలనొప్పి పట్టుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని బీజేపీ, జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో ఒకటైన గృహలక్ష్మి స్కీమ్ కు కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ఊహించని మెలిక పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇంటి పెద్ద అత్త అంగీకరిస్తే కోడలికి ప్రతినెల రూ. 2,000 ఇస్తామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు. అయితే ప్రతి ఇంటిలో అత్త ఆమె కోడలికి ప్రతినెల ప్రభుత్వం రూ. 2 వేలు ఫ్రీగా ఇస్తే అంగీకరిస్తుందా ?, అసలు అత్తా కోడలు ఈ విషయంలో ఓ అంగీకారానికి వస్తారా ? అనే విషయం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

Congress guarantee money will be given to daughter in law only if mother in law agrees

కర్ణాటక మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ మీడియా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ పథకాల్లో ఒకటైన గృహలక్ష్మి హామీ పథకం కింద కుటుంబ సభ్యులైన అత్తగారింటికే తొలి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ప్రతి ఇంటిలో అత్తకు ప్రతినెల రూ. 2 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా మేము ముందుకు వెలుతామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు.

మన సంప్రదాయంలో కుటుంబానికి పెద్ద అయిన అత్తగారికి నెలకు రూ.2 వేలు గౌరవ వేతనం ఇస్తామని, అత్తగారు అంగీకరిస్తే, కోడలికి గృహలక్ష్మి హామీ గౌరవ వేతనం రూ. 2 వేలు ఇస్తామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గృహలక్ష్మి హామీ పథకంలో ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Congress guarantee money will be given to daughter in law only if mother in law agrees

ప్రతినెలా ఒక్కొ ఇంటికి రూ. 2 వేలు గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్పింది. ఇచ్చిన ఐదు హామీలు వందల శాతం కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికీ బీజేపీ నేతలు హామీ పథకం గురించి చాలా పట్టుబడుతున్నారు. మా ఐదు గ్యారెంటీ ప్లాన్‌ల గురించి ఎలాంటి గందరగోళం లేదు.

ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నాయని సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు. హామీ పథకం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక మంత్రుతో సమావేశం అయ్యారు. సిద్ధరామయ్య మంత్రులతో చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమావేశంలో చర్చించి కుటుంబ పెద్ద అయిన అత్తగారికి నెలనెలా గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంటి యజమాని అయిన మహిలకు నెలనెలా 2 వేలు గౌరవ వేతనం సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను నమ్మించిన బీజేపీ చివరికి అదే ప్రజలను మోసం చేసిందని, మేము అలా చెయ్యమని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+