షాక్: టీవీ నటి అమృతాతో పెళ్లి, దిగ్విజయ్ ధ్రవీకరణ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్నేత దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్టు అమృతా రాయ్ వివాహం చేసు కున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గత నెలలో తమిళనాడులో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దిగ్విజయ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుల నుంచి ఈ సమాచారం తెలిసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అమృతా రాయ్ కూడా సెలవులో ఉన్నారని చెబుతున్నారు.

68 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్, 44 ఏళ్ల అమృతా రాయ్‌ల మధ్య ప్రేమ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తోన్న విషయం తెలిసిందే. గత ఏప్రిల్ లో వారి ప్రేమ విషయాన్ని దిగ్విజయ్ చెప్పారు. అప్పటి నుంచి వీరి వివాహం విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిపై డిగ్గీ, అమృతాలు స్పందించవలసి ఉంది.

అమృతా రాయ్‌‍కు గతంలోనే వివాహం జరిగింది. విడాకుల అనంతరం ఆమె దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ భార్య 2013లో అనారోగ్యంతో కన్నుమూశారు. డిగ్గీకి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

 Congress leader Digvijay Singh marries long-time girlfriend Amrita Rai

ఇదిలా ఉండగా, అమృతా రాయ్.. తమ పెళ్లిని నిర్ధారించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తాము హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నామని ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఇటీవలి కాలంలో తాను కొన్ని చిక్కులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారని తెలుస్తోంది. దిగ్విజయ్‌ని ప్రేమించానని, అది తన సొంత నిర్ణయమని ఆమె చెప్పారని తెలుస్తోంది.

నేను డిగ్గీని ప్రేమతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఆస్తుల కోసం కాదని ఆమె అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అందుకే డిగ్గీ ఆస్తులన్నింటీని.. ఆయన కొడుకు, కూతుళ్ల పేర రాయమని చెప్పానని అమృతా రాయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ధృవీకరించిన డిగ్గీ!

దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నట్లు టీవీ యాంకర్ అమృతా రాయ్ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు. డిగ్గీ, అమృతా రాయ్‌లు పెళ్లి చేసుకున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం కూడా వచ్చింది. దీనిపై, అమృతా రాయ్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. అమృతా రాయ్ ప్రకటనను డిగ్గీ కూడా ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+