ఎలక్షన్స్: పార్టీ టిక్కెట్ రాలేదని విషం తాగిన నేత, మృతి

నవంబర్ 25వ తేదీన జరిగే ఎన్నికలకు తనకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందనే కారణంతో నర్సింగ్ మాల్వియా అనే నాయకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నర్సింగ్ మాల్వియా అగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు. అతను ఈ రోజు ఉదయం విషం తాగాడు. అతనిని చికిత్స కోసం వెంటనే ఉజ్జయిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
వివరాల మేరకు.. నర్సింగ్ మాల్వియా జిల్లా పంచాయతీ మెంబర్. అతను రెండు దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీలో పని చేస్తున్నారు. గతంలో అతను ఎప్పుడు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే ఈసారి తనకు టిక్కెట్ వస్తుందని ఆశించారు.
అగర్ నుండి పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారట. అయితే టిక్కెట్ మరో వ్యక్తికి వచ్చింది. టిక్కెట్ రాకపోవడంతో అతను విషం తాగారట.












Click it and Unblock the Notifications